కేసీఆర్ రిటర్న్ గిప్ట్ ఇదేనా...? సాక్ష్యాలివే..: డాటా చోరీపై చంద్రబాబు

Published : Mar 09, 2019, 03:45 PM ISTUpdated : Mar 09, 2019, 04:34 PM IST
కేసీఆర్ రిటర్న్ గిప్ట్ ఇదేనా...? సాక్ష్యాలివే..: డాటా చోరీపై చంద్రబాబు

సారాంశం

తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతోందని  చంద్రబాబు ఆరోపించారు. ఓ నియంతలా వ్యవహరించే కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ లో తమ సామంత రాజ్యాన్ని స్థాపించాలని భావిస్తున్నారు. అందుకోసమే త్వరలో జరగనున్న ఎన్నికల ఖర్చు కోసం వైఎస్సార్ సిపి పార్టీకి వెయ్యి కోట్ల రూపాయలు అందించారన్నారు.ఇదే కేసీఆర్ తనకిస్తానన్న రిటర్న్ గిప్ట్ అయి వుంటుందని చంద్రబాబు అన్నారు. ఇలా ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవంపై దెబ్బతీయడానికి టీఆర్ఎస్, వైఎస్సార్ సిపి లు పథకరచన చేసినట్లు ఆరోపించారు. కేసీఆర్, జగన్ తో పాటు డిల్లీ లోని బిజెపి ప్రభుత్వ పెద్దలు తమతో పెట్టుకుంటే ఖబర్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు. 

విభజన చట్టం ప్రకారం తమ రాష్ట్రానికి చెందిన ఆస్తులను ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసింది. అలాగే ఆ చట్టంలోని హామీల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇలాంటి పార్టీలతో కలిసి వైఎస్సార్ సిపి మరోసారి తెలుగు ప్రజలకు అన్యాయం చేయడానికి కుట్రలు పన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు.   

తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కాళేశ్వరం కట్టుకోవచ్చు..కానీ తమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి పిర్యాదులు చేస్తారా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై అనవసర ఆరోపణలు, ఫిర్యాదులు చేయడం మానుకోవాలని చంద్రబాబు సూచించారు. తమ ప్రజలు, రైతుల కోసం తాము ప్రాజెక్టలను కట్టుకోవద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు.   
 
బిజెపి రాష్ట్ర నాయకులు శుక్రవారం డిల్లీకి వెళ్లి తాము ప్రజలకు అందించే ఓ సంక్షేమ పథకంపై పిర్యాదు చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. కేంద్రంలోని మీ పార్టీ నేరుగా రెండు వేల రూపాయలు ఇవ్వవచ్చు... తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే కూడా తప్పలేదు...కానీ మా వరకు వచ్చేసరికి తప్పు కనిపిస్తోందా? అని ప్రశ్నించారు.సొంత రాష్ట్ర ప్రజలపై వారికెంత ప్రేముందో దీన్ని బట్టే అర్థమవుతోందని చంద్రబాబే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అన్నగారి బాక్స్ ఆఫీస్ స్టామినా.. సీనియర్ ఎన్టీఆర్ హిట్స్
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే