వైసీపీలోకి చల్లా.. ముహుర్తం ఫిక్స్

Published : Mar 06, 2019, 04:47 PM IST
వైసీపీలోకి చల్లా.. ముహుర్తం ఫిక్స్

సారాంశం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కీలకనేతలు కొందరు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కీలకనేతలు కొందరు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. తాజాగా మరో నేత పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

మాజీ శానసభ్యుడు చల్లా రామకృష్ణా రెడ్డి వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదు దశాబ్దాలుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు బ్యాంక్‌ కలిగిన చల్లా నిర్ణయంతో  జిల్లాలో టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. 

కాగా  చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఫాక్స్‌ ద్వారా లేఖ పంపారు. చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు.దీంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu