డేటా చోరీ.. మధ్యాహ్నం 1 గంటకు సాక్ష్యాలు బయటపెడతా: బాబు

By Siva KodatiFirst Published Mar 9, 2019, 10:20 AM IST
Highlights

స్వచ్ఛందంగా ప్రజా సేవ చేసేందుకు ముందుకొచ్చిన డ్వాక్రా మహిళలపై ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 

స్వచ్ఛందంగా ప్రజా సేవ చేసేందుకు ముందుకొచ్చిన డ్వాక్రా మహిళలపై ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్ - 2019లో భాగంగా ఆయన అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... సాధికార మిత్రలపై ఫిర్యాదు చేయడం ద్వారా పేదలకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. చివరికి మంత్రి ఫరూక్ వంటి సీనియర్ల ఓట్లను సైతం తొలగించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  

వైసీపీ అధికారంలోకి వస్తే..  ప్రజల ప్రాణ-ఆస్తులకు రక్షణ ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు ఏపీ కలకలం ఊడిగం చేయాలని చెబుతున్న కేసీఆర్‌కు జగన్ సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తెలంగాణకు కాళేశ్వరం కావాలట.. ఏపీకి పోలవరం వద్దంట అని ఎద్దేవా చేశారు. ఓట్ల దొంగలు ఏపీపై పడ్డారని, బతికున్నవాళ్లు చనిపోయారని ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

టీడీపీ డేటా దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని, టీడీపీ డేటా చోరీకి వైసీపీ యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని, మధ్యాహ్నం ఒంటిగంటకు సాక్ష్యాధారాలను బయటపెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. ఈ రోజుతో 25 ఎంపీ స్థానాల పరిధిలో సమీక్ష పూర్తవుతుందన్నారు. అభ్యర్థులపై రానున్న రెండు రోజుల్లో విశ్లేషించి తర్వాత ప్రచారం, బహిరంగసభలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.

ఏప్రిల్ మొదటి వారంలో రైతులకు మరో రూ.4 వేల కోట్లు ఇస్తామని, విద్యుత్ బకాయిల కింద తెలంగాణ ప్రభుత్వం ఏపీకి రూ.11,278 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. 

click me!