కూతురిపై అత్యాచారం, హత్య: ఆవేదనతో తండ్రి మృతి

Published : Mar 06, 2019, 07:53 AM ISTUpdated : Mar 06, 2019, 07:54 AM IST
కూతురిపై అత్యాచారం, హత్య: ఆవేదనతో తండ్రి మృతి

సారాంశం

 గుంటూరు జిల్లాలో జ్యోతి అనే మహిళ అత్యాచారం, హత్యకు గురవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో ఇప్పటికే విషాదంలో మునిగిపోయిన మృతురాలి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది.   

 గుంటూరు జిల్లాలో జ్యోతి అనే మహిళ అత్యాచారం, హత్యకు గురవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో ఇప్పటికే విషాదంలో మునిగిపోయిన మృతురాలి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. 

కూతురు మృతివార్త తెలిసి తీవ్ర ఆవేదనకు గురైన ఆమె తండ్రి అంగడి గోవింద్‌ గుండె పోటుకు గురయ్యారు. అప్పటినుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు మంగళవారం తుది శ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబం మరింత దు:ఖానికి గురయ్యింది. 

అమరావతి టౌన్‌షిప్ సమీపంలో  ఈ నెల 11వ తేదీ రాత్రి జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె ప్రియుడు శ్రీనివాసే ఈ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.పెళ్లి చేసుకోమని జ్యోతి శ్రీనివాస్ పై ఒత్తిడి తీసుకురావడం వల్లే హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.   

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu