వైసీపీ రెండో జాబితా అప్పుడే... ఎవరెవరికి టికెట్ దక్కనుందంటే...

Published : Dec 30, 2023, 08:57 AM IST
వైసీపీ రెండో జాబితా అప్పుడే... ఎవరెవరికి టికెట్ దక్కనుందంటే...

సారాంశం

సెకండ్ లిస్టు కింద 11 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ లిస్టులో తూర్పుగోదావరి,అనంతపురం జిల్లాలకు చెందిన వారిని ప్రకటించే అవకాశం ఉంది.   

అమరావతి : సిట్టింగుల మార్పు కాక రేపుతోందా? వైసీపీ రెండో లిస్ట్ ప్రకటన ఆలస్యం కానుందా? మొదటి లిస్టు పరిణామాలేంటి? కార్యకర్తలు సిట్టింగుల గురించి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మూడో లిస్టులో ఎంతమంది ఉండబోతున్నారు? సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న తాడేపల్లి హిట్ లిస్టులు...

వైసీపీలో ఇంచార్జ్ ల మార్పు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి లిస్టులో 11 నియోజకవర్గాలకు వైసిపి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడురెండో లిస్టులో కూడా మరో 11 నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు లిస్టుల తరువాత మూడో లిస్టు కూడా ఉండనుంది. ఆ లిస్టులో 35మంది అభ్యర్థులు ఉండనున్నట్లు తెలుస్తోంది. 

ఈ మార్పుల నేపథ్యంలో వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ అయిన తాడేపల్లి ఆందోళనలతో అట్టుడుకుతోంది. సిట్టింగుల్లో ఎవరి ఛీటీ చిరగనుందో తెలియన అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మొదటి లిస్ట్ వెలువడిన తరువాత కొంతమంది కార్యకర్తలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు వద్దంటూ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. 

ప‌వ‌న్ అక్క‌డి నుంచే పోటీ చేయ‌నున్నారా? రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాఫిక్..!

నరసరావుపేట ఎమ్మెల్యే వద్దంటూ కార్యకర్తలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఇదే బాటలో సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దంటూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజకే మరోసారి టికెట్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు ఆయన అనుచరులు, కార్యకర్తలు. 

ఇప్పటివరకు ప్రకటించిన మొదటి జాబితాలో టికెట్ల దక్కని నేతల వ్యాఖ్యలతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వీరిలో కొందరు పార్టీకి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండగా, మరికొందరు రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. మొదటి లిస్టులో పేరులేని ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించారు.

మరోవైపు టికెట్ దక్కక పోవడంతో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తరువాత కూల్ అయ్యారు. దీంతో మొదటి లిస్ట్ తలనొప్పులను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా రెండో లిస్టును ప్రకటించాలని యోచిస్తోందట అధిష్టానం. అందుకోసం తొందరపడొద్దని జనవరి 2వ తేదీ వరకు ఆగాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఇవ్వాళా, రేపట్లో రెండో లిస్ట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఆలస్యం కానుంది. ఇప్పటికే కినుకలో ఉన్న నేతలను బుజ్జగించే పనిని రీజినల్ కోఆర్డినేటర్లకు అధిష్టానం అప్పగించింది. అయితే, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ బుజ్జగింపులు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో అన్ని పంచాయతీలు ముఖ్యమంత్రి జగన్ దగ్గరికే చేరుతున్నాయి. వీటన్నింటినీ తీర్చలేక సీఎం జగన్ తల పట్టుకుంటున్నారు. 

వెళ్లిపోయేవారు తమ వారు కాదని, గెలవని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగించలేమని అంటున్నారు. ఈ గందరగోళాల మధ్యే వైసిపి మరో లిస్టు రెడీ చేసుకుంది. సెకండ్ లిస్టు కింద 11 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ లిస్టులో తూర్పుగోదావరి,అనంతపురం జిల్లాలకు చెందిన వారిని ప్రకటించే అవకాశం ఉంది. 

తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గానూ 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉండబోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, పి గన్నవరం, అమలాపురం, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, జగ్గంపేట నియోజకవర్గాల్లో మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. 

ఇక అనంతపురంలో ఉన్న 14  నియోజకవర్గల గాను నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు ఉండనుంది. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెనుగొండ, సింగనమలలలో అభ్యర్థులు మారనున్నారు. ఈ లిస్టును జనవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. రెండో లిస్ట్ విడుదల తరువాత ఏ నేత ఉంటారు ఏ నేత వెళతారని అధిష్టానం అంచనా వేసుకుంటోంది. 

నేతల రియాక్షన్స్ బట్టి మూడో లిస్ట్ రిలీజ్ చేసే యోచనలో ఉంది. మూడో లిస్ట్ కింద 35 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసిపి ఇన్ ఛార్జ్ లు జాబితా

పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్న జాబితా

రంపచోడవరం - ధనలక్ష్మి

జగ్గంపేట - తోట నరసింహం

పిఠాపురం - వంగా గీత

కాకినాడ రూరల్ - కన్న బాబు

కాకినాడ సిటీ - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

తుని- దాడిశెట్టి రాజా

రాజమండ్రి సిటీ - మార్గాని భరత్

రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల్

అనపర్తి - సుత్తి సూర్యనారాయణ రెడ్డి

పి.గన్నవరం - వాకా రమాదేవి

అమలాపురం - పినిపే శ్రీకాంత్

కొత్త పేట - జగ్గీ రెడ్డి

మండ పేట - తోట త్రిమూర్తులు.

రామచంద్రపురం - పిల్లి సూర్యప్రకాష్

పెద్దా పురం - దవులూరి దొరబాబు

పత్తిపాడు - వరుపుల సుబ్బారావు

పోలవరం - తెల్లం రాజ్య లక్ష్మీ

రాజోలు - రాపాక వరప్రసాద్

రాజానగరం  - జక్కంపూడి రాజా

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?