తాడేపల్లిలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం

Published : Aug 10, 2019, 01:05 PM ISTUpdated : Aug 10, 2019, 01:11 PM IST
తాడేపల్లిలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం

సారాంశం

శనివారం నుంచి కేంద్ర కార్యాలయం వేదికగా వైసీపీ తన కార్యకలాపాలను సాగించనుంది. మూడు అంతస్తుల్లో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రెండో అంతస్తును పార్టీ అనుబంధ విభాగాల కోసం కేటాయించారు.


తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. 

శనివారం నుంచి కేంద్ర కార్యాలయం వేదికగా వైసీపీ తన కార్యకలాపాలను సాగించనుంది. మూడు అంతస్తుల్లో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రెండో అంతస్తును పార్టీ అనుబంధ విభాగాల కోసం కేటాయించారు. ఇక మూడో అంతస్తులో పార్టీ అధినేత జగన్, పార్టీలో కీలక నేత విజయసాయి రెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల కోసం ప్రత్యేకంగా చాంబర్లు కేటాయించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్