జీతం తీసుకుంటున్నారు.. జనాన్ని గుర్తు పెట్టుకోండి: బాబుపై విజయసాయి ఫైర్

By Siva KodatiFirst Published Jul 3, 2019, 1:51 PM IST
Highlights

ఎన్నికలకు ముందు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు

ఎన్నికలకు ముందు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షనేత ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ధైర్యానికి జోహార్లని విజయసాయి ఎద్దేవా చేశారు.

విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు.

ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు.

ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. 

విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ.

— Vijayasai Reddy V (@VSReddy_MP)
click me!