టీడీపీలోకి వైసీపీ కీలకనేత...కాకినాడ లోక్‌సభపై గురి..?

Siva Kodati |  
Published : Feb 24, 2019, 10:22 AM IST
టీడీపీలోకి వైసీపీ కీలకనేత...కాకినాడ లోక్‌సభపై గురి..?

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ ఇటీవల రాజీనామా చేసిన కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన తాజాగా టీడీపీలో చేరుతురాని ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబుతో భేటీలో భాగంగా టీడీపీ నుంచి కాకినాడలో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరే ఛాన్సులున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొనసీమ రాజకీయాల్లో ఈయనకు మంచి గుర్తింపు ఉంది.

2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి.. కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు చేతిలో 30 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 లో కాకినాడ లోక్‌సభ  నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సునీల్, టీడీపీ అభ్యర్ధి తోట నరసింహం చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

అనంతర రాజకీయ పరిణామాలతో చలమలశెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన మద్ధతుదారులు అధిక సంఖ్యలో ఉండటంతో పాటు సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా సునీల్ జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే చివరి నిమిషంలో చలమలశెట్టి మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం