ఐటీ, సెల్‌ఫోన్లను కనిపెట్టారు: బాబుపై రాజ్యసభలో విజయసాయి సెటైర్లు

Published : Sep 20, 2023, 05:05 PM IST
ఐటీ, సెల్‌ఫోన్లను కనిపెట్టారు: బాబుపై  రాజ్యసభలో  విజయసాయి సెటైర్లు

సారాంశం

రాజ్యసభలో చంద్రబాబుపై  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

న్యూఢిల్లీ: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. రాజ్యసభలో  బుధవారంనాడు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై  విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.ఐటీ, సెల్ ఫోన్లు,కంప్యూటర్లను తానే కనుగొన్నట్టుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారన్నారని ఆయన ఎద్దేవా చేశారు. అదే నిజమైతే వాటి పేటేంట్  హక్కుల కోసం కేంద్రం ప్రయత్నించాలని ఆయన కోరారు.చంద్రబాబు నాయుడు  ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ఐటీ పై  ఫోకస్ పెట్టారు.

ఆ సమయంలో చంద్రబాబు నాయుడు  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా  సీఈఓగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఐటీపై పెట్టిన ఫోకస్ ఇతర రంగాలపై  పెట్టాలని సూచించాయి. అయితే  ఐటీ రంగంపై అప్పట్లో తాను ఫోకస్ పెట్టిన కారణంగానే  సైబరాబాద్ లో ఐటీ కంపెనీలు  ఏర్పాటయ్యాయని చంద్రబాబు సహా, టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఈ నెల 9వ తేదీన చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ  హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అప్పట్లో  ఐటీపై ఫోకస్ పెట్టిన కారణంగానే  ప్రపంచంలోనే  పలు దేశాల్లో ఐటీ నిపుణుల్లో  తెలుగు వారు ఎక్కువగా ఉన్నారని టీడీపీ నేతలు  తమపై చేసిన విమర్శలకు కౌంటర్లిస్తున్నారు.

కంప్యూటర్లు, సెల్ ఫోన్లను కూడ తానే కనుగొన్నట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. ఇవాళ రాజ్యసభలో కూడ ఇవే వ్యాఖ్యలను  విజయసాయి రెడ్డి చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu