బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు: పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్లు

Published : Jul 30, 2023, 10:55 AM ISTUpdated : Jul 30, 2023, 11:06 AM IST
బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు: పురంధేశ్వరిపై  విజయసాయి రెడ్డి సెటైర్లు

సారాంశం

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు  పురంధేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  విమర్శలు గుప్పించారు.

అమరావతి:బీజేపీ అంటే బాబు జనతా  పార్టీ కాదంటూ    ఆంధ్రప్రదేశ్ బీజేపీ  రాష్ట్ర అధ్యక్షురాలు  పురంధేశ్వరిపై  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి  సెటైర్లు వేశారు. తండ్రి పెట్టిన పార్టీపై  ప్రేమ.. మరిది కళ్లలో  ఆనందమే టార్గెట్ గా  పనిచేస్తున్నారని  విజయసాయి రెడ్డిపై ఆమె విమర్శలు   చేశారు.  పార్లమెంట్  లో విగ్రహం  ఆవిష్కరణ సమయంలో  సోనియాగాంధీ, అప్పటి స్పీకర్  మీరాకుమార్ ను  ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని  విజయసాయి రెడ్డి ప్రస్తావించారు.  

 

ఎన్టీఆర్ మహా నటులు.  మీరు కాదనుకున్నామన్నారు.  పార్లమెంట్ లో  ఎన్టీఆర్ విగ్రహం పెట్టిన సమయంలో సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపిన మీరు... అదే ఉత్సాహంతో  బీజేపీలో  జీవిస్తున్నారంటే మీ నటనా కౌశలాన్ని అభినందించాల్సిందేనని  విజయసాయి రెడ్డి   వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2004లో  పురంధేశ్వరి క్రియాశీల రాజకీయ రంగ ప్రవేశం చేశారు.   కాంగ్రెస్ పార్టీ నుండి  2014లో  ఆమె బాపట్ల నుండి పోటీ చేసి ఎంపీగా  విజయం సాధించారు.  కేంద్ర మంత్రిగా  కూడ  పనిచేశారు.  2014  ఎన్నికలకు ముందు ఆమె  కాంగ్రెస్ పార్టీని వీడారు . బీజేపీలో చేరారు.   దక్షిణాదిలో  బీజేపీని బలోపేతం  చేసేందుకు గాను  ఆ పార్టీ నాయకత్వంసంస్థాగతంగా మార్పులు  చేసింది.  

ఈ క్రమంలోనే  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో   బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను  మార్చింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును  తప్పించింది.  ఆయన స్థానంలో  పురంధేశ్వరిని  నియమించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న బండి సంజయ్ తన పదవికి  రాజీనామా చేశారు సంజయ్ స్థానంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని  ఆ పార్టీ నాయకత్వం నియమించింది.  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu