లిక్కర్ విక్రయాలపై ఆరోపణలు .. ఆమెది నిలకడలేని రాజకీయం : దగ్గుబాటి పురందేశ్వరికి విజయసాయిరెడ్డి కౌంటర్

Siva Kodati | Published : Oct 28, 2023 3:38 PM

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి . పురందేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని.. ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు.

Google News Follow Us

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. శనివారం ఆయన బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరిది నిలకడలేని రాజకీయమని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ఆమెకు ఓ నియోజకవర్గం లేదని.. స్వార్ధ, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పురందేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని.. ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. పురందేశ్వరి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. లిక్కర్ విషయంలో తనపై , మిథున్ రెడ్డిపై ఆమె విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: రామోజీరావుకు కొడాలి నాని బహిరంగం లేఖ.. ఇంతకీ ఏ అంశాలను ప్రస్తవించారంటే..?

సీపీ పెత్తందారుల పార్టీ కాదు.. పేదల, బలహీన పార్టీ అని తెలిపారు. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమేనని.. ఆయన వలన అభివృద్ధి చెందిన చంద్రబాబు వర్గీయులేనని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు పట్ల ప్రజలు సానుభూతి చూపించడం లేదని.. జాతీయ నాయకులు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు పాపం పండింది కనుకే జైల్లో వున్నారని.. పక్కా ఆధారాలతోనే ఆయన అరెస్ట్ అయ్యారని విజయసాయిరెడ్డి తెలిపారు. లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవని.. చంద్రబాబులా లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి వర్గం కూర్పులోనూ సామాజిక న్యాయం చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. 

Read more Articles on