అమరావతిలో చంద్రబాబు బినామీలకే భూములు:సురేష్

Published : Nov 27, 2019, 12:59 PM IST
అమరావతిలో చంద్రబాబు బినామీలకే భూములు:సురేష్

సారాంశం

చంద్రబాబు బినామిలు రాజధాని మాటున భారీగా భూములు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. 

న్యూఢిల్లీ: చంద్రబాబు బినామిలు రాజధాని మాటున భారీగా భూములు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. రాజధానికి చందాలుగా ఇచ్చిన ఇటుకలను విద్యార్ధుల చందాలను కూడ మాయం చేశారని ఆయన విమర్శించారు.

బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 9 వేల కోట్లు రాజధానికి వెచ్చించామని చెప్పారు. మేం న్యాయం చేశాం అని టిడిపి ఎంపీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.

హైకోర్టు,తాత్కాలిక సచివాలయం రెండూ కూడా వర్షం వస్తే నీటిలో మునిగిపోతాయన్నారు. తాత్కాలికం పేరుతో చంద్రబాబు ఆయన అనుచరులు దోచుకొంటున్నారని సురేష్ విమర్శించారు.

రాజధానిలో శాశ్వత భవనాలు అంటే లెక్కలు చూపించాల్సి వస్తోందని తెలుగు తమ్ముళ్లకు భయం పట్టుకొందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఏపీ రాజధానికి చేసిందేమీ లేక గత 40 ఏళ్ల అనుభవం చెప్పుకొంటూ వెళ్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజధానిలో పర్యటించే అర్హత చంద్రబాబునాయుడుకు లేదన్నారు. 

ఐదేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పనిచేసి కుంభకోణాల మయం చేశాడని ఆయన విమర్శించాడు. 

బుద్దిహీనమైన ఆలోచనలు మానుకోని హుందాగా వ్యవహరించాలని చంద్రబాబునాయుడుకు ఆయన హితవు పలికారు. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలతో సాగుతున్నారని  ఆయన ఆరోపించారు. 

రాజధానిని ఎలా నిర్మించాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తెలుసు.మీలాంటి వారితో చెప్పించుకోవాల్సిన పరిస్దితి ఆయనకు లేదన్నారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ 45 ఏళ్ల యువకుడు. అయినా కూడ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌కు ఏమీ కాదన్నారు. 

మీరు లేనిపోని ఆరోపణలు చేయడం, మాట్లాడడం వల్ల ప్రజలకు ఏం జరగదన్నారు. ప్రతిపక్షహోదాలో  ఉండి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు.

దళితులకు ప్యాకేజిఇచ్చే విషయంలో మెట్టభూమిరైతులకు జరీబురైతులకు 1450 గజాలు ఇచ్చారన్నారు. అసైన్డ్ రైతులకు ప్యాకేజీ ఇచ్చే విషయంలో  600,800,1000 గజాలుగా ప్రకటించిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఈ భూములు కూడ చంద్రబాబునాయుడు బినామీలకే కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 

దళిత రైతులను సర్వనాశనం చేశారని ఆయన ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్‌కు భూమిని తీసుకోకముందే వైఎస్ జగన్ లింగాయపాలెం వచ్చి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇచ్చిన విషయాన్ని  ఎంపీ సురేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మంచి ఆలోచన చేయాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. బొండాఉమ మాటలు అందరికి తెలుసునన్నారు. బొండా ఉమ అసెంబ్లీలో ఏం మాట్లాడారో తెలుసునని చెప్పారు. 

చంద్రబాబుకు వత్తాసు పలకాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు.ఆయనకు రాజధాని గురించి తెలియదని  ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలతోనే రాజధాని కట్టేశారని చెప్పాడు

రాజధానిని మారుస్తానని సీఎం  వైయస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదు, రాజధానిని అభివృధ్ది చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నారు.చంద్రబాబులాగా దుబారా చేయం.కొంతడెవలప్ చేసి ప్రజలకు ఇస్తే వారే డెవలప్ చేస్తారని తమ ఉద్దేశ్యమని ఆయన తేల్చి చెప్పారు. 

చంద్రబాబు రాజధానిని స్మశానంలా తయారుచేశారని అన్నారే వేరేగా చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఏపి సంపాదన అంతా సింగపూర్ లో దాచారు.

సింగపూర్ లా కట్టాలి అంటే ఆర్దికంగా బాగా బలవంతులం అయిఉండాలి.అది గ్రాఫిక్స్ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.రాజధాని లో మాది ఉద్దండరాయుని పాలెం ఇప్పటికి కూడా పాములు, పుట్టలు ఉంటే గ్రాఫిక్స్ చూస్తే మాత్రం ఏదో జరిగినట్లు కనిపిస్తుందన్నారు.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu