మోదీని కలిస్తే తప్పా, అడక్కుండానే వివరణ ఇచ్చా: జగన్ తో భేటీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు

By Nagaraju penumala  |  First Published Nov 22, 2019, 7:43 PM IST

మోదీ పలకరించి తన భుజం తట్టినంత మాత్రాన తాను పార్టీలైన్ దాటాననడం సరికాదన్నారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.ప్రధాని నరేంద్రమోదీని కలిసినంత మాత్రాన తాము బీజేపీతో టచ్ లో ఉన్నామనడంలో అర్థం లేదన్నారు. 


అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ తాను ఎప్పుడూ దాటలేదని స్పష్టం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. పార్టీ నిర్ణయానికి కట్టుబడే తాను ప్రవర్తిస్తున్నానని అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు వ్యవహరించలేదన్నారు. ఎప్పుడు తాను పార్టీ లైన్ దాటలేదన్నారు. 

నర్సాపురం నియోజకవర్గం సమస్యలపై సీఎం జగన్ తో చర్చించినట్లు తెలిపారు. లోక్ సభలో తాను మాట్లాడిన అంశంపై సీఎం జగన్ ఎలాంటి వివరణ కోరలేదన్నారు. అయితే తమ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనే రాలేదన్నారు. 

Latest Videos

సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ: మీడియం రగడపై వివరణ

అయితే సభలో తాను మాట్లాడిన అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తానే సుమోటోగా సీఎం జగన్ కు వివరించినట్లు తెలిపారు. స్నేహపూరితమైన వాతావరణంలో తమ మధ్య చర్చలు జరిగినట్లు తెలిపారు.  

ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీకి వ్యక్తిగతంగా తాను తెలుసునని అందువల్లే తనను పలకరించారన్నారు. గతంలో తాను బీజేపీలో ఉన్నానని తెలిపారు. మోదీ ప్రధానిగా ఉన్నప్పుడే కాకుండా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కలిశానన్నారు. 

తాను సభ నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ బయటకు వస్తున్నారని తనను చూసి రాజుగారు బాగున్నారా అంటూ పలకరించారని గుర్తు చేశారు. మోదీ పలకరించి తన భుజం తట్టినంత మాత్రాన తాను పార్టీలైన్ దాటాననడం సరికాదన్నారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.

ప్రధాని నరేంద్రమోదీని కలిసినంత మాత్రాన తాము బీజేపీతో టచ్ లో ఉన్నామనడంలో అర్థం లేదన్నారు. నియోజకవర్గ సమస్యలపై ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులను బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉందన్నారు. 

అంతేగానీ వారితో పరిచయాలు ఉన్నంత మాత్రాన బీజేపీలోకి చేరిపోతున్నట్లు, పార్టీ లైన్ దాటినట్లేనని ప్రచారం చేస్తే ఎలా అంటూ నిలదీశారు. తాను సభలో మాట్లాడింది తెలుగు భాషను కాపాడాలని కోరానే తప్ప ఇంగ్లీషు భాష గురించి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. 

ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు: రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్...

 తెలుగు అకాడమీని ఏర్పాటు చేశామని చెప్పడం పార్టీలైన్ దాటడమా అంటూ నిలదీశారు. తెలుగు భాష వేరు ఇంగ్లీషు మీడియం వేరు అంటూ చెప్పుకొచ్చారు. ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం మంచిదేనన్నారు. 

ఇకపోతే బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నట్లు వైసీపీ ఎంపీలు ఎవరూ బీజేపీతో టచ్ లో లేరన్నారు రఘురామకృష్ణంరాజు. సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు తమ పార్టీ ఎంపీలు గట్టిగా కౌంటర్ ఇచ్చారని తెలిపారు. 

వైసీపీ నుంచి గెలుపొందిన ఒక్క ఎంపీ కూడా పార్టీలైన్ దాటరని, బీజేపీతో టచ్ లో లేరన్నారు. బీజేపీకి టచ్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చారు.సెంట్రల్ హాల్, పార్లమెంట్ హౌస్ లో ఒకరిని ఒకరు కలుసుకుంటామని అది కేవలం అప్పటి వరకు మాత్రమేనని అంతేకానీ పార్టీ లైన్ దాటడం కాదన్నారు రఘురామకృష్ణంరాజు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ ఎంపీలందరికీ ఎంతో అభిమానం ఉందని, గౌరవం కూడా ఉందన్నారు రఘురామకృష్ణంరాజు. జగన్ ఆదేశాలను ధిక్కరించే సాహసం ఏ ఒక్కఎంపీ చేయలేరని చెప్పుకొచ్చారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. 

ఇంట్రెస్టింగ్: వైసీపీ ఎంపీకి జగన్ క్లాస్, బాగున్నారా అంటూ ఆ ఎంపీ భుజం తట్టిన మోదీ...

 

click me!