రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం : మోడీకి రఘురామ లేఖ

By Siva KodatiFirst Published Dec 30, 2020, 2:58 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీకి నరసాపురం, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. 

ప్రధాని నరేంద్ర మోదీకి నరసాపురం, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామతీర్థంలో విగ్రహాలను తాజాగా ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.

గడిచిన 18 నెలల కాలంలో రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాలపై 100కి పైగా దాడులు జరిగినట్లు నరసింహారాజు లేఖలో పేర్కొన్నారు. కాగా, రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.

డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలను సేకరించే పనిలో వున్నారు. అనంతరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. 
 

click me!