అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు... విచారణ జరపాల్సిందే : వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 18, 2022, 5:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. 
 

వైసీపీ (ysrcp) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలులో (paddy procurement) భారీగా అవినీతి జరుగుతోందని.. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రైతులను నిండా ముంచుతోన్న వారిపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. 

సీఎం జగన్ (ys jagan) బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో (ysrcp rajya sabha candidates) రెండు పదవులను బీసీలకు కట్టబెట్టారని ఆయన ప్రశంసించారు. ఆర్.కృష్ణయ్య (r krishnaiah), బీద మస్తాన్ రావులకు (beeda mastan rao) రాజ్యసభ పదవులు కట్టబెట్టడం అభినందనీయమన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే పదవులను సీఎం జగన్ సామాన్య బీసీలకు కట్టబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచిందని సుభాష్‌ చంద్రబోస్ అన్నారు. ఈ విషయం చంద్రబాబు (chandrababu naidu) ఊహకు సైతం అంది ఉండదని... ఆయన ఎప్పుడూ బడా పారిశ్రామిక వేత్తలకే రాజ్యసభ సభ పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం Pilli Subhash Chandra Bose అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్ లో కుప్పకూలిపోవడంతో సహచర ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. 

click me!