ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం: అఫ్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట

By narsimha lode  |  First Published Sep 8, 2023, 5:20 PM IST


ఢిల్లీ లిక్కర్ స్కాంలో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్ గా మారారు.
 


అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాంపై  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్ గా మారారు.   ఇదే కేసులో ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి అఫ్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే  20 మంది నుండి కీలక సమాచారం సేకరించింది ఈడీ.  హైద్రాబాద్ నుండి ఢిల్లీకి నగదు బదిలీపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన సమాచారంతో  పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విషయమై  ఈడీ అధికారులు దర్యాప్తులో మరింత దూకుడును పెంచింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అఫ్రూవర్ గా మారారు.ఈ కేసులో మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డిలు బెయిల్ పై ఉన్నారు.

జీ  20 సమావేశాలు ముగిసిన తర్వాత  దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి  అఫ్రూవర్ గా మారడంతో   ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్ గా వ్యవహరించిన బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.  నాలుగైదు రోజుల క్రితం  బుచ్చిబాబును ఢిల్లీ లిక్కర్ స్కాంలో  విచారించారు. ఇదే కేసులో ఢిల్లీకి చెందిన దినేష్ ఆరోరా కూడ అఫ్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు కీలకంగా వ్యవహరించారనే దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా  దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.  అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో  కీలకంగా ఉన్న  వారు  అఫ్రూవర్ గా మారడంతో  దర్యాప్తు సంస్థల పని సులభమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  అయితే  ఈ కేసు రాజకీయంగా కీలక పరిణామాలకు దారితీసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos

undefined

హైద్రాబాద్ కు చెందిన ఒకరిని  ఢిల్లీకి పిలిపించి  కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించినట్టుగా  తెలుగు మీడియా చానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి.   మాగుంట శ్రీనివాసులు రెడ్డి  అఫ్రూవర్ గా మారారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్స్ ఎన్‌టీవీ, టీవీ9, ఎబీఎన్ కథనాలు ప్రసారం చేశాయి.

 

click me!