కేశినేని నాని వైసీపీలోకి వస్తే స్వాగతిస్తాం: వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి

By narsimha lodeFirst Published May 31, 2023, 11:30 AM IST
Highlights

విజయవాడ ఎంపీ కేశినేని  నాని వైసీపీలోకి వస్తే  స్వాగతిస్తామని  వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి  చెప్పారు. 

విజయవాడ: విజయవాడ ఎంపీ  కేశినేని నాని  వైసీపీలోకి వస్తే  స్వాగతిస్తామని  ఆ పార్టీ ఎంపీ  అయోధ్య రాంరెడ్డి  చెప్పారు. బుధవారంనాడు  విజయవాడలో  వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి మీడియాతో మాట్లాడారు.   విజయవాడ  ఎంపీ కేశినేని  నాని    ప్రజల కోసం  పనిచేస్తాడని ఆయన  చెప్పారు.   కష్టాల్లో  ఉన్నవారి కోసం  నాని  ఎప్పుడూ  పనిచేస్తాడన్నారు.  వైసీపీలోకి  కేశినేని  వస్తే  స్వాగతిస్తామన్నారు. 2014, 2019  ఎన్నికల్లో  విజయవాడ నుండి  కేశినేని నాని టీడీపీ అభ్యర్ధిగా  పోటీ  చేసి విజయం సాధించారు. 

2019  లో  విజయవాడ  నుండి రెండో దఫా విజయం సాధించిన  తర్వాత టీడీపీ  నాయకత్వంపై  కేశినేని నాని  ప్రత్యక్షంగా, పరోక్షంగా  వ్యాఖ్యలు  చేస్తున్నారు.  విజయవాడ  పార్లమెంట్  నియోజకవర్గం పరిధిలోని  టీడీపీ  ఇంచార్జీలపై  కేశినేని నాని  విమర్శలు  చేస్తున్నారు.  ఆయా  నియోజకవర్గాల్లో  వైసీపీ  ఎమ్మెల్యేలకు   నాని  సహకరిస్తున్నారని  టీడీపీ  నేతలు ఆరోపిస్తున్నారు. 

అయితే  కొన్ని రోజుల క్రితం  నందిగామ ఎమ్మెల్యే  జగన్మోహన్ రావునుబ  ఎంపీ  కేశినేని  నాని  పొగడ్తలతో ముంచెత్తారు.  అభివృద్ది  కార్యక్రమాల  విషయంలో  జగన్మోహన్ రావు రాజీ పడరన్నారు.  తమ పార్టీలు వేరైనా  అభివృద్ది  కార్యక్రమాల విషయంలో కలిసి  పనిచేస్తామన్నారు . దేశంలో  అధికార, విపక్షాలు ఇదే తరహలో  పనిచేస్తే  దేశం ముందుకు సాగుతుందని   విజయవాడ ఎంపీ కేశినేని నాని  వ్యాఖ్యానించారు. కేశినేని  నాని  నందిగామ ఎమ్మెల్యే  జగన్మోహన్ రావు  అభినందించారు. మంచి చేస్తే  ప్రశంసించడంలో తప్పు ఏముందని  ఆయన  ప్రశ్నించారు.  నందిగామలో  ఎమ్మెల్యే  జగన్మోహన్ రావుకు  వ్యతిరేకంగా  స్థానిక టీడీపీ నాయకత్వం  ఆందోళనలు  నిర్వహిస్తుంది. ఈ సమయంలో  ఎమ్మెల్యే  జగన్మోహన్ రావుకు మద్దతుగా  మాట్లాడడం  టీడీపీ శ్రేణుల్లో  ఆగ్రహనికి కారణమైంది.  సోషల్ మీడియాలో  కేశినేని నానికి వ్యతిరేకంగా  పోస్టులు పెట్టింది.  

2019  ఎన్నికల తర్వాత  అవకావశం దొరికినప్పుడల్లా  టీడీపీ నేతలపై  నాని  విమర్శలు  చేస్తున్నారు. ఈ తరుణంలో  నాని సోదరుడు  కేశినేని చిన్ని    నియోజకవర్గంలో  విస్తృతంగా  పర్యటిస్తున్నారు. నియోజకవర్గానికి  చెందిన  టీడీపీకి చెందిన  ఇంచార్జీలు, నేతలు  చిన్నికి సహకరిస్తున్నారు.  పార్టీ టిక్కెట్టు ఇస్తే పోటీకి  సిద్దమని  చిన్ని  గతంలో  సంకేతాలు  ఇచ్చారు. ఈ తరుణంలో   వైసీపీ ఎంపీ  అయోధ్య రాంరెడ్డి కేశినేని నాని ని వైసీపీలోకి  వస్తే స్వాగతిస్తామని  చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం  రాజకీయంగా  ప్రాధాన్యత  సంతరించుకున్నాయి.

click me!