దేవినేని ఉమాపై కేసీఆర్ వ్యాఖ్యలు నిజమే: ఆడోమగో తెలియడం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే

By Nagaraju penumalaFirst Published Nov 20, 2019, 5:35 PM IST
Highlights

దేవినేని ఉమామహేశ్వరరావు వెకిలి చేష్టలు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్. దేవినేని ఉమా ఆడోమగో తెలియదంటూ సీఎం కేసీఆర్ అన్న  వ్యాఖ్యలు నిజమేననిపిస్తోందన్నారు.   

అమరావతి: మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా విమర్శలు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. 

దేవినేని ఉమా ప్రెస్మీట్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. మైలవరంలో ప్రజలు బుద్ది చెప్పిన ఉమాలో ఎలాంటి మార్పు రాలేదంటూ ధ్వజమెత్తారు. దేవినేని ఉమా ఇసుక మాఫియా కింగ్ అని తెలుసుకాబట్టే చంద్రబాబు ఇసుక దీక్ష వేదిక వద్దకు రానివ్వలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

పోలవరం ప్రాజెక్టు అనేది రాజశేఖర్ రెడ్డి కలల పంట అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఉమా అసెంబ్లీ రాసుకోమన్నారని తీరా చూస్తే అక్కడ పనులు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. 

పోలవరం 2018కి ఎక్కడ పూర్తి చేశారో చెప్పగలరా ఉమా అంటూ సవాల్ విసిరారు. ఉమా చేసిన అవినీతి నచ్చకనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ వల్ల వందలకోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని గుర్తు చేశారు. 

దేవినేని ఉమామహేశ్వరరావు వెకిలి చేష్టలు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్. దేవినేని ఉమా ఆడోమగో తెలియదంటూ సీఎం కేసీఆర్ అన్న  వ్యాఖ్యలు నిజమేననిపిస్తోందన్నారు.   

కేసీఆర్ విమర్శలే నిజమయ్యేలా దేవినేని ఉమా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావుకి పిచ్చెక్కినట్లు ఉందని అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు.  సీఎం జగన్ తలుపులు తెరిస్తే టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమన్నారు.  

రాష్ట్రమంత్రులపై దేవినేని వ్యాఖ్యలు సరికాదన్నారు. మంత్రులను పట్టుకుని సన్నాసి అని మాట్లాడటం రాజకీయాల్లో సరికాదంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు సంస్కారం ఉంది కాబట్టే టీడీపీ నేతలు పట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. 

ఇకనైనా దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అంపశయ్యమీద ఉందని చెప్పుకొచ్చారు.  

తెలంగాణలో కనుమరుగైన టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకునే అర్హత లేదన్నారు. మాజీమంత్రులు లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకున్నారో ఇచ్చిన వారెవరతో త్వరలోనే మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. 

మైలవరం నియోజకవర్గం పనుల్లో లోకేష్ కు 5 శాతం దేవినేని ఉమాకు 3 శాతం చొప్పున కమిషన్లు వసూళ్లు చేశారని ఆరోపించారు. దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన అవినీతికి జైలుపాలవ్వడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హెచ్చరించారు. 

click me!