అందుకే అర్థరాత్రి చంద్రబాబును లగడపాటి కలిశారు...: గుట్టు విప్పిన వైసీపీ ఎమ్మెల్యే

By Nagaraju penumalaFirst Published Nov 20, 2019, 5:10 PM IST
Highlights

లాంకోతో అగ్రిమెంట్‌ కోసమే ఆనాడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చంద్రబాబును కలిశారని గుర్తు చేశారు. లగడపాటికి లాభం చేకూర్చినందు వల్లే సర్వేలు చంద్రబాబుకు అనుకూలంగా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. 

అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని స్పష్టం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ రెడ్డిని పరిశ్రమల శాఖ మంత్రిగా చేస్తే ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 

పరిశ్రమల మంత్రిగా అమర్నాథ్ రెడ్డి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ మూతపడే స్టేజికి వచ్చేలా వింత నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు.  పరిశ్రమల శాఖకు సంబంధించి రూ.50 వేలకోట్ల బిల్లులు పెండింగ్‌ లో పెట్టారంటూ నిప్పులు చెరిగారు. 

చిన్నపరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ.7వేల కోట్ల రాయితీలు ఇవ్వకుండా ఆ సొమ్ముతో జల్సాల కోసం ఖర్చుపెట్టారంటూ ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలపై మంత్రి అమర్నాథ్ రెడ్డి సమాధానం చెప్పగలరా అంటూ నిలదీశారు.  

ఈరోజు చిన్న పరిశ్రలు నష్టపోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన తప్పులే కారణమని ఆరోపించారు. తాము ఏ కంపెనీకి వ్యతిరేకం కాదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్‌ అగ్రిమెంట్లు అధికరేట్లకు పెంచడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వచ్చిందన్నారు.  

తన సొంతమనుషులకు లాభం చేకూర్చడం కోసం చంద్రబాబు విద్యుత్ అగ్రిమెంట్లు అత్యధిక రేట్లకు పెంచేశారంటూ ఆరోపించారు. లాంకోతో అగ్రిమెంట్‌ కోసమే ఆనాడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చంద్రబాబును కలిశారని గుర్తు చేశారు.  

లగడపాటికి లాభం చేకూర్చినందు వల్లే సర్వేలు చంద్రబాబుకు అనుకూలంగా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. అందువల్లే వాటిని పున: సమీక్షించినట్లు చెప్పుకొచ్చారు. గత 20 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు ఏ కేసు వచ్చినా హడావిడిగా వెళ్లి స్టేలు తెచ్చుకుంటారంటూ ఆరోపించారు. 

చంద్రబాబు నాయుడుకు దమ్ము ధైర్యం ఉంటే తాను చెప్పుకుంటున్నట్లు నిప్పు అయితే తనపై ఉన్న కేసుల్లో స్టేలు తొలగించుకుని విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కేసులపై స్టేలు ఎత్తివేసి విచారణకు సిద్ధమైతే ప్రపంచంలోనే అవినీతిపరుడు చంద్రబాబు అని నిరూపితమవుతారని అలా కానిపక్షంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

లోకేష్ ఇంట్లో మద్యం, ఏరులై పారుతోందన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

click me!