కోర్టులో ఆ ఛార్జ్‌షీట్ మాయం చేయించాడు.. 40 లక్షలు ఖర్చు : జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఆరోపణలు

Siva Kodati |  
Published : Jan 03, 2023, 06:05 PM ISTUpdated : Jan 03, 2023, 06:30 PM IST
కోర్టులో ఆ ఛార్జ్‌షీట్ మాయం చేయించాడు.. 40 లక్షలు ఖర్చు : జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఆరోపణలు

సారాంశం

కోర్టులో లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల ఛార్జ్‌షీట్‌ను ప్రభాకర్ రెడ్డి మాయం చేయించాడని సంచలన ఆరోపణలు చేశారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ప్రభాకర్ రెడ్డికి నేరాలు చేయడం.. అధికారులపై వేయడం అలవాటంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల ఛార్జ్‌షీట్‌ను ప్రభాకర్ రెడ్డి మాయం చేశాడని ఆయన ఆరోపించారు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి ఛార్జ్‌షీట్‌ను కనిపించకుండా చేశాడని పెద్దారెడ్డి అన్నారు. పోలీసులు, కోర్టు సిబ్బంది ప్రభాకర్ రెడ్డికి సహకరించారని ఆయన ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డికి నేరాలు చేయడం.. అధికారులపై వేయడం అలవాటంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 

కాగా.. గత నెలలో తాడిపత్రిలో సీబీఐ సోదాలు నిర్వహించిన  సంగతి తెలిసిందే. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 పేరిట అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ వాహనాల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జఠాదర ఇండస్ట్రీస్ చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. కీలకమైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. జఠాధర ఇండస్ట్రీస్‌తో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారుల ఎదుట ఇప్పటికే రెండు సార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు.. రంగంలోకి సీబీఐ , తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడి ఇంట్లో సోదాలు

బీఎస్ 3 వాహనాలను స్క్రాప్స్ కింద కొని బీఎస్ 4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా జేసీ ట్రావెల్స్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వాటిలో చవ్వా గోపాల్ రెడ్డి పేరిట కొన్ని వాహనాలు వున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ సంచలన కామెంట్స్ | Jagan Comments on Vizag Steel Plant Incident