లగడపాటి సర్వే ఫేక్, వైసీపీకి 130 సీట్లు పక్కా: వైసీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులు

Published : May 22, 2019, 03:49 PM IST
లగడపాటి సర్వే ఫేక్, వైసీపీకి 130 సీట్లు పక్కా: వైసీపీ నేత కోరుముట్ల శ్రీనివాసులు

సారాంశం

ఉనికి కోసం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెప్తున్నాయని స్పష్టం చేశారు. 

తిరుపతి: ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసరావు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 

బుధవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఉనికి కోసం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెప్తున్నాయని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపోతే మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. లగడపాటి సర్వే చేయకుండా అబద్దాలు చెప్పారని అవన్నీ ఫేక్ అంటూ విమర్శించారు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు.  

PREV
click me!

Recommended Stories

మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి