ముందు బిజెపి వదినమ్మ, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ...: చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు

By Arun Kumar P  |  First Published Feb 15, 2024, 7:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేసారు. చంద్రబాబు డిల్లీ పర్యటన, జనసేనతో సీట్ల సర్దుబాటు, రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి లతో టిడిపి వ్యవహరిస్తున్న తీరుపై నాని రియాక్ట్ అయ్యారు. 


గుడివాడ : ఉత్త పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్,బిజెపి వదినమ్మ పురందీశ్వరి, కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిల... వీరందరినీ వెంటపెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వస్తున్నారంటూ మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేసారు. అందరూ కలిసి కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారని ... వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం ప్రారంభించారని కొడాలి నాని అన్నారు. 

ఇప్పటికే ఏపీలో వున్న రాజకీయ పార్టీలన్నింటితో కలిసినా వైసిపిని ఎదుర్కోగలమన్న నమ్మకం రాలేనట్లుంది... అందుకే చంద్రబాబు డిల్లీ పెద్దలను కలిసారన్నారు. కానీ గతంలోలా చంద్రబాబు ఏదిచెబితే అది వినడానికి డిల్లీలో వాజ్ పేయి, అద్వానీ లేరని... మోదీ, అమిత్ షా వున్నారన్నారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని ... ఏపీలో బిజెపి అభ్యర్థులకు బరిలోకి దింపుతామని డిల్లీపెద్దలు చెప్పినట్లున్నారని అన్నారు. లేదంటే 150 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాల్లో బిజెపి... మిగతా చోట్ల మీరు పోటి చేయాలని చెప్పివుంటారు ... అందువల్లే చంద్రబాబు మంచాన పడి హైదరాబాద్ నుండి రావడంలేదని నాని ఎద్దేవా చేసారు.  ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందన్నారు. 

Latest Videos

వీడియో

 

ఇక  జనసేనాని పవన్ కల్యాణ్ పై కూడా కొడాలి నాని సెటైర్లు వేసారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేకుంటే ఏం కారులో భీమవరం వెళ్లలేరా? మంగళగిరి నుండి కేవలం గంట గంటన్నరలో వెళ్లవచ్చని అన్నారు.  జనంలోకి వెళ్లలేకే అనుమతులంటూ పవన్ నాటకాలు ఆడుతున్నాడని నాని అన్నారు. టిడిపి, బిజెపి లతో పొత్తుల గురించి, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని పార్టీ నాయకులు, ప్రజలు అడుగుతారు... ఈ ప్రశ్నలకు జవాబు జనసేన అధ్యక్షుడి వద్ద లేదు... అందువల్లే భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నాడని కొడాలి నాని తెలిపారు.
 

click me!