చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం .. తప్పిన ముప్పు

By Siva Kodati  |  First Published Feb 15, 2024, 12:57 AM IST

మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక కుట్ర కోణం వుందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు.


మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉండవల్లిలోని కృష్ణా కరకట్టపై వున్న చంద్రబాబు నివాసం సమీపంలోని తాటిచెట్లకు ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరుగులు పెట్టారు. చంద్రబాబు నాయుడు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో వుండటంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. దీంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

మరోవైపు అగ్ని ప్రమాదం సమయంలోనే కొంతమంది హైకోర్టు జడ్జీలు అటుగా వెళ్లారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక కుట్ర కోణం వుందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే చంద్రబాబు నివాసం వద్ద గతంలోనూ అగ్నిప్రమాదం సంభవించింది. ఎండుగడ్డికి నిప్పు అంటుకున్న పొలాల్లో మంటలు వ్యాపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. 

Latest Videos


 

click me!