సాయిబాబా గుడికొస్తున్నా.. ప్రమాణం చేస్తా: వెలగపూడి సవాల్‌ స్వీకరించిన గుడివాడ

Siva Kodati |  
Published : Dec 26, 2020, 05:24 PM IST
సాయిబాబా గుడికొస్తున్నా.. ప్రమాణం చేస్తా: వెలగపూడి సవాల్‌ స్వీకరించిన గుడివాడ

సారాంశం

ఏపీ రాజకీయాల్లో ప్రమాణాల పర్వం హాట్ హాట్‌గా సాగుతోంది. భూకబ్జాలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేసిన సవా‌ల్‌ను స్వీకరించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్

ఏపీ రాజకీయాల్లో ప్రమాణాల పర్వం హాట్ హాట్‌గా సాగుతోంది. భూకబ్జాలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేసిన సవా‌ల్‌ను స్వీకరించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. ఆదివారం సాయిబాబా గుడి దగ్గరకు అమర్‌నాథ్ వెళ్లనున్నారు. అయితే ప్రమాణానికి విజయసాయి కూడా రావాలని ఇవాళ మరోసారి సవాల్ విసిరారు వెలగపూడి.

భూకబ్జాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి మద్ధతుగా ఇరు పార్టీల్లోని నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.

ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

విషయం తెలుసుకున్న వెలగపూడి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని స్పష్టం చేశారు. తాను విజయసాయిరెడ్డికి సవాలు విసిరితే మధ్యలో వీళ్లేవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాను విజయసాయిరెడ్డిని మాత్రమే ప్రమాణం చేయమన్నాను అని రామకృష్ణ బాబు పేర్కొన్నారు. ఎంతో నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానని.. సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని వైసీపీ నేతలు చేసిన సవాల్‌ను స్వీకరిస్తానన్నారు. అయితే విజయసాయిరెడ్డి కూడా అక్కడకొచ్చి ప్రమాణం చేస్తారా అని వెలగపూడి ప్రశ్నించారు.

ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు విజయనిర్మల.. సాయిబాబా చిత్రపటంతో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో విజయనిర్మల ఆమె వెనక్కి వెళ్లిపోయారు. 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu