నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా జరగలేదు: అధికారులపై మరోసారి ఆనం ఫైర్

Published : Jan 27, 2021, 03:02 PM IST
నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా జరగలేదు: అధికారులపై మరోసారి ఆనం ఫైర్

సారాంశం

రిపబ్లిక్ డే వేడుకలకు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందకపోవడంపై  వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు:  రిపబ్లిక్ డే వేడుకలకు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందకపోవడంపై  వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోవడంపై ఆయన మండిపడ్డారు. తన 40 ఏళ్ల  రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటనలను ఏనాడూ చూడలేదన్నారు. ఇది చాలా సిగ్గు చేటని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆహ్వానాలున్నాయి. కానీ పక్కన పెట్టాలని తమకు చెప్పారని కొందరు అధికారులు  చెప్పారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఎవరు ఎందుకు అలా చెప్పారో చెప్పాలన్నారు.

ఈ విషయమై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. అధికారులపై  కేసు వేస్తానని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu