చంద్రబాబు స్పూర్తితోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.
అమరావతి: చంద్రబాబు స్పూర్తితోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.
గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్ఈసీ రాజ్యాంగ స్పూర్తితో పనిచేయడం లేదన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు ఇంతకు ముందు జరగలేదా అని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదని ఎక్కడ ఉందని ఆయన అడిగారు.
కక్షలు, కార్ఫణ్యాలు లేకుండా ఏకగ్రీవ ఎన్నికలు జరగడాన్ని ఎందుకు తప్పుబడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబునాయుడు విడుదల చేశారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్దమన్నారు.
రాజ్యాంగానికి విరుద్దంగా చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. ఇది నిబంధనలకు విరుద్దమన్నారు. ఈ నిబంధనలకు విరుద్దంగా మేనిఫెస్టోను విడుదల చేసిన బాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.