సింపతీ కోసమే చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు: అంబటి రాంబాబు

By narsimha lode  |  First Published Nov 19, 2021, 3:44 PM IST


చంద్రబాబు భార్య భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని వైసీపీ ఎమ్మెల్యే  అంబట రాంబాబు చెప్పారు. భార్య పేరుతో సానుభూతిని పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


అమరావతి: చంద్రబాబు భార్య భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. భార్య పేరుతో చంద్రబాబు సింపతీ పొందాలని ప్రయత్నిస్తున్నారని  రాంబాబు మండిపడ్డారు. తాను గానీ, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా భువనేశ్వరినీ ఏమీ అనలేదన్నారు.కుప్పం మున్సిపాలిటీ సహా అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా సీఎం జగన్ వైపే ఉన్నారన్నారు.సభలో tdp సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని Ambati Rambabu ఆరోపించారు.చంద్రబాబు స్వంతంగా ఎప్పుడూ సీఎం కాలేదన్నారు.Chandrababuను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంబటి రాంబాబు చెప్పారు.  

రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్ధమైందని అంబటి రాంబాబు తెలిపారు. రాజకీయంగా తెలివిగలవాడు కాబట్టే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసి చంద్రబాబు భార్య పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు.చంద్రబాబుకు పదవే సర్వస్వమన్నారు. ఎన్టీఆర్‌ను, తోడల్లుడిని, , బావ మరదులను పక్కన నెట్టారని చెప్పారు.  తాను గానీ తమ పార్టీ సభ్యులు కానీ భువనేశ్వరినీ ఏమీ అనలేదన్నారు. భువనేశ్వరిని ఏమైనా అంటే చూపించాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

Latest Videos

also read:ఒక కన్నును మరో కన్ను ఎలా పొడుచుకొంటుంది: వైఎస్ వివేకా హత్యపై జగన్

బాబాయ్, గొడ్డలి, చెల్లెలు సంగతి తేలాలని చంద్రబాబు అన్నప్పుడు తాము కూడా వంగవీటి రంగా,  మాధవరెడ్డి హత్యల గురించి కూడా తేలాలని చెప్పామన్నారు. తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ   అయిపోయాక చివరగా సానుభూతి అస్త్రాన్ని  ప్రయోగించేందుకు చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారని అంబటి రాంబాబు తెలిపారు. ఎన్టీఆర్ కూతురును తాము ఒక్క మాట కూడా అనలేదన్నారు.ధైర్యముంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. కన్నీళ్లు వచ్చాయో లేదో తాను చూడలేదని అంబటి రాంబాబు చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు నవరసాలను చూపించారని తెలిపారు.
 

click me!