సెల్ ఫోన్ వద్దు, బంధాలే ముద్దు: సెల్ ఫోన్ పై వైసీపీ ఎమ్మెల్యే గగ్గోలు

By Nagaraju penumalaFirst Published Oct 2, 2019, 10:52 AM IST
Highlights

ఆదివారాన్ని నో ఫోన్ డేగా పరిగణించాలని సూచించారు. తాను నో ఫోన్ డేగా ఆదివారాన్ని ప్రకటించుకున్నానని తాను ఇకపై ఆదివారం ఫోన్ ముట్టుకోవద్దు అనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం తన  కుటుంబ సభ్యులతో కలిసి గడిపే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

మంగళగిరి: సెల్ ఫోన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం మనిషి జీవితాన్ని సెల్ ఫోన్ ఎంతో ప్రభావితం చేస్తోందన్నారు. మనిషికి ప్రపంచం గురించి తెలియజేయడంతోపాటు ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుందని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా తనను సెల్ ఫోన్ ఎంతో ప్రభావితం చేసిందన్నారు. తనను ప్రపంచానికి పరిచయం చేసింది సెల్ ఫోన్ అని అలాగే ప్రపంచాన్ని తనకు పరిచయం చేసింది కూడా సెల్ ఫోన్ అని చెప్పుకొచ్చారు. 

సెల్ ఫోన్ పై ప్రతీ ఒక్కరూ నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు. రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెల్ ఫోన్ వినియోగించేలా ప్రతీ ఒక్కరూ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆదివారం అసలు సెల్ ఫోన్ ను పట్టించుకోవదన్నారు. 

ఆదివారాన్ని నో ఫోన్ డేగా పరిగణించాలని సూచించారు. తాను నో ఫోన్ డేగా ఆదివారాన్ని ప్రకటించుకున్నానని తాను ఇకపై ఆదివారం ఫోన్ ముట్టుకోవద్దు అనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం తన  కుటుంబ సభ్యులతో కలిసి గడిపే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

సెల్ ఫోన్ వచ్చిన తర్వాత తాను ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నాను ఎంతో మంచి నేర్చుకున్నానని తెలిపారు. అయితే ఇదే సెల్ ఫోన్ మోజులోపడి కుటుంబాలను, సంప్రదాయాలను, మిత్రులను, బంధువులకు దూరం అవుతున్నానేమోనని చెప్పుకొచ్చారు. 

నో ఫోన్ డేగా ఆదివారాన్ని పరిగణించడం వల్ల ప్రజలకు అందరికీ, బంధువులకు, స్నేహితులకు మరింత దగ్గర అయ్యే అవకాశం ఉందని తన మనసులో మాట చెప్పారు. అయితే తాను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో అయితే ఫోన్ లోకి అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. 
 

click me!