మెుదటి రౌండ్లో వైసీపీ ముందంజ

Published : May 23, 2019, 09:03 AM IST
మెుదటి రౌండ్లో వైసీపీ ముందంజ

సారాంశం

కపోతే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి 650 ఓట్ల మెజారిటీలో ముందంజలో ఉన్నారు. అటు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీర భద్ర స్వామి ముందంజలో ఉన్నారు.250 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. తొలిరౌండ్ పూర్తయ్యే సరికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. 

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి 650 ఓట్ల మెజారిటీలో ముందంజలో ఉన్నారు. అటు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీర భద్ర స్వామి ముందంజలో ఉన్నారు.250 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

అలాగే అనంతపురం అర్బన్, శ్రీకాళహస్తి, చిత్తూరు, కదిరి, జగ్గంపేట నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అనంతపురం అర్బన్ లో వైసీపీ అభ్యర్థి 129 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

అలాగే కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి 1250 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ తంబళ్ళపల్లి, పెద్దాపురం నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ 336 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్