చంద్రబాబు, లోకేష్‌లపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు: ఎందుకంటే?

By narsimha lode  |  First Published Apr 9, 2021, 2:36 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఏపీ డీజీపీకి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు  శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.
 


గుంటూరు: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఏపీ డీజీపీకి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు  శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.

తిరుపతి ఎంపీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా  డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు.  అయితే  గురుమూర్తిని కించపరుస్తూ  సోషల్ మీడియాలో  టీడీపీ నేతలు పోస్టింగ్ పెట్టారని వైసీపీ ఆరోపించింది.ఈ విషయమై చంద్రబాబు, లోకేష్ లపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని  వైసీపీ డిమాండ్ చేసింది.ఈ మేరకు డిమాండ్లతో కూడిన  వినతిపత్రాన్ని  డీజీపీకి వైసీపీ అందించింది.

Latest Videos

undefined

వైసీపీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నేతృత్వంలోని బృందం ఇవాళ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ నెల 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో  విజయం కోసం వైసీపీ, టీడీపీ, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ఈ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ఈ స్థానంలో గెలిచి వైసీపీకి చుక్కలు చూపాలని విపక్షానికి చెందిన టీడీపీ, బీజేపీలు వ్యూహాలను పన్నుతున్నాయి.
 

click me!