హనుమంతుని జన్మస్థానం తిరుమల.. ఉగాదికి నిరూపిస్తాం.. టీటీడీ

By AN TeluguFirst Published Apr 9, 2021, 2:18 PM IST
Highlights

హిందువుల ఆరాధ్యదైవం, కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమల ఇకపై హనుమంతుని జన్మస్థానంగా కూడా గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13 తెలుగు సంవత్సరాది ఉగాదినాడు ఈ విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు టిటిడి సిద్ధమైంది. 

అంజనాద్రిలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతోసహా నిరూపించేందుకు 2020 డిసెంబరులో టిటిడి పండితులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పలు సమావేశాలు నిర్వహించి లోతుగా అధ్యయనం చేసిన ఈ కమిటీ హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు దోహదపడే బలమైన ఆధారాలు సేకరించింది.

జ్యోతిషశాస్త్రం, పురాతన శాసనాలు, పురాణాలు, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కమిటీ ఈ సమాచారాన్ని నిర్ధారించింది. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రేననే వివరాలతో టీటీడీ త్వరలోనే ఒక సమగ్రమైన పుస్తకాన్ని కూడా తేనుంది. 

శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచలమహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్సంహితల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామివారి చెంతగల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీల ప్రకారం నిర్ధారించారు.

click me!