ఈ నాటకాలేంటి చంద్రం సార్: విజయసాయి రెడ్డి వ్యంగాస్త్రాలు

By Arun Kumar PFirst Published Feb 16, 2019, 11:30 AM IST
Highlights

ఏపి సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సిపి సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఏపి రాజధాని అమరావతి నగరం గురించి చంద్రబాబు కామెంట్స్ పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో చంద్రబాబు చేసిన ప్రకటనలు, అభివృద్ది ప్రసంగాలపై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు.  
 

ఏపి సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సిపి సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఏపి రాజధాని అమరావతి నగరం గురించి చంద్రబాబు కామెంట్స్ పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో చంద్రబాబు చేసిన ప్రకటనలు, అభివృద్ది ప్రసంగాలపై విజయసాయిరెడ్డి ద్వజమెత్తారు. 

''అమరావతిని మరో పదేళ్లలో ప్రపంచంలోనే అత్యంత జీవనయోగ్య నగరంగా మారుస్తారట. 2018 ర్యాంకుల ప్రకారం మొదటి 100 నగరాల్లో దేశంలోని ఒక్క సిటీకి కూడా స్థానం దొరక లేదు. వినేవాళ్లు నవ్వుతారన్న భయం లేకుండా ఈ ఛలోక్తులేమిటి చంద్రబాబు గారూ.'' అంటూ విజయసాయిరెడ్డి మొదటి ట్వీట్ చేశారు. 

అనంతరం అదే రాజధాని అమరావతి అభివృద్దిపై విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. '' అసలక్కడ నగరం లేదు, నివాసితులు లేరు. అమరావతిలో రెండో సారి హ్యాపీ సిటీస్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. క్యాంటన్, జ్యూరిచ్ నగరాలతో 2000-వాట్-స్మార్ట్ సిటీ ఒప్పందాలు చేసుకున్నారట. గ్రాఫిక్స్ తర్వాత ఎంఓయూల దశ మొదలైనట్టుంది. పది రోజుల్లో షెడ్యూల్ వస్తుంటే ఈ నాటకాలేంటి చంద్రం సార్.'' అంటూ చంద్రబాబును కడిగిపారేశారు. 

మరో ట్వీట్ లో ''అమరావతిని వాటర్ సెన్సిటివ్ సిటీగా మార్చేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారట. దాని అర్థం తెలుసో లేదో? లాండ్రీకి సబ్బులు, బాత్రూముల్లో క్లీనింగ్ కెమికల్స్ వాడరాదనేది wsc కాన్సెప్ట్. మురుగు నీరు కూడా స్వచ్ఛంగా ఉండాలి. దీనికోసం జ్యూరిచ్ నుంచి ప్రతినిధులను రప్పించారు. పిచ్చి ముదిరింది.'' అంటూ విజసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 

ఇక చివరగా విజయసాయిరెడ్డి చంద్రబాబు అభివృద్ది, ప్రాజెక్టుల శంకుస్థాపనలపై చేసిన ప్రసంగంపై సెటైర్లు విసిరారు. ''మళ్లీ వేశాడు. ఒక్క రోజే 30 పనులకు శంకుస్థాపనలు చేశాడట. 8000 కోట్లతో వీటిని పూర్తి చేస్తారట. ఆ 30 ప్రాజెక్టుల పేర్లు మీడియా కూడా ప్రస్తావించలేదు. మీకైనా తెలుసా చంద్రబాబు గారూ. జ్వరం 105 డిగ్రీలకు చేరింది. కనిపించిన మాత్రలన్నీ మింగుతున్నాడు.'' అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. 

 

click me!