మేం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధం.. కానీ ఉద్యోగ సంఘాలే: సజ్జల రామకృష్ణారెడ్డి

By Siva KodatiFirst Published Jan 27, 2022, 3:53 PM IST
Highlights

ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సూచించారు. పరిస్థితి చేజారిపోక ముందే ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ముగించేందుకు సహకరించాలని రామకృష్ణారెడ్డి కోరారు. చర్చలకు రమ్మని తామే కోరుతున్నామని సజ్జల తెలిపారు. 

ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సూచించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పరిస్థితి చేజారిపోక ముందే ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ముగించేందుకు సహకరించాలని రామకృష్ణారెడ్డి కోరారు. చర్చలకు రమ్మని తామే కోరుతున్నామని సజ్జల తెలిపారు. 

అయినా చర్చలకు రాకుండా మొండికి వేయడం తగదని హితవు పలికారు. చర్చలకు వస్తేనే కదా? కమిటీలో చర్చిస్తేనే కదా? అసలు సమస్య ఏంటో తెలిసేది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ కమిటీ పరిధిలో లేని అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఉద్యోగ సంఘాల నేతలు మొండికేయడం తగదని రామకృష్ణారెడ్డి అన్నారు. తాము చర్చల కోసం ప్రతి రోజూ సచివాలయంలో వేచి చూస్తూనే ఉంటామన్నారు.

కాగా..  కొత్త PRC జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలో కొత్త జీవోల ఆధారంగానే జీతాల చెల్లింపునకు సంబంధించి AP Government చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు Finance శాఖ ఇవాళ మరో సర్క్యూలర్ ను Treasuryకార్యాలయాలకు పంపింది. కొత్త పీఆర్సీ జీవోల మేరకు జీతాల బిల్లులను అప్‌లోడ్ చేసి ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని ఆర్ధిక శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ విషయమై ఉద్యోగుల నుండి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు మాత్రం కొత్త పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

కొత్త పీఆర్సీ అమలు చేసే సమయంలో సాధారణంగా పాత పీఆర్సీ ఇష్టమా, కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు తీసుకొంటారా అనే విషయమై ఉద్యోగుల నుండి ప్రభుత్వం ఆఫ్షన్ తీసుకొంటుంది. అయితే కొత్త పీఆర్సీని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.. ఉద్యోగుల ఆఫ్షన్ తీసుకోకుండా  కొత్త పీఆర్సీ ఎలా అమలు చేస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

జనవరి మాసానికి పాత వేతనాన్ని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కొత్త పీఆర్సీని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. HRA  తగ్గింపుతో పాటు ఇతర అంశాలపై  ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో విబేధిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వచ్చే నెల 7వ తేదీ నుండి Stirke కు కూడా వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసకొన్నాయి. ఈ నెల 24న ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వానికి సమ్ము నోటీసును కూడా ఇచ్చాయి.

అయితే కొత్త జీతాలను అందించేందుకు ఆర్ధిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కొత్త పీఆర్సీ మేరకు ఉద్యోగుల జీతాల బిల్లులను అప్‌లోడ్ చేయాలని DDAలకు ఆర్ధిక శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.జీతాలు, Pension బిల్లుల ప్రాసెస్ పై గడువు నిర్ధేశిస్తూ సర్క్యులర్  జారీ చేసింది. కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు , పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలని  ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

click me!