ఏపీ కొత్త కేబినెట్‌ : కూడికలు, తీసివేతల్లో జగన్‌ బిజీ.. సజ్జలతో 3 గంటల పాటు భేటీ

Siva Kodati |  
Published : Apr 08, 2022, 08:47 PM ISTUpdated : Apr 08, 2022, 08:51 PM IST
ఏపీ కొత్త కేబినెట్‌ : కూడికలు, తీసివేతల్లో జగన్‌ బిజీ.. సజ్జలతో 3 గంటల పాటు భేటీ

సారాంశం

నూతన మంత్రివర్గ కూర్పుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. ఆశావహుల నుంచి వస్తున్న అభ్యర్ధనలు, ప్రచారంలో వున్న పేర్లపై వ్యక్తమవుతోన్న అభ్యంతరాలపై సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు

సీఎం జగన్‌తో ప్రభుత్వ  సలహాదారు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సమావేశం ముగిసింది. మంత్రి వర్గ పునర్ వ్యవస్ధీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఎవరినీ కొనసాగించాలి..? ఎవరికి అవకాశం కల్పించాలి ..? అనే అంశంపై చర్చించారు. ఆశావహుల నుంచి వస్తున్న అభ్యర్ధనలు, ప్రచారంలో వున్న పేర్లపై వ్యక్తమవుతోన్న అభ్యంతరాలపై సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. రేపు మరోసారి వీరిద్దరూ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గ కూర్పుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. దీంతో ఆశావహుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కేబినెట్‌లోకి ఎవరిని తీసుకుంటారనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ నాటికి సీఎం YS Jagan  కేబినెట్‌లోకి తీసుకొనే వారి పేర్లను Rajbhavan కు పంపనున్నారు. 

ఈ నెల 7వ తేదీన Cabinet సమావేశంలోనే ministerతో రాజీనామాలు తీసుకున్నారు సీఎం జగన్.. 24 మంది నుండి రాజీనామా పత్రాలను సీఎం జగన్ తీసుకున్నారు. అయితే అనుభవం దృష్ట్యా ప్రస్తుతం ఉన్న సీనియర్లలో నలుగురైదుగురిని మంత్రివర్గంలో కొనసాగిస్తానని కూడా సీఎం ప్రకటించారు. అయితే నిన్న కేబినెట్ సమావేశం తర్వాత  సీఎం జగన్ తన మనసు మార్చుకున్నారని ప్రచారం సాగుతుంది. Resignation చేసిన 24 మంది మంత్రుల్లో ఏడు నుండి 11 మంది మంత్రులను తిరిగి కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.  ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఎందరిని కొనసాగిస్తారో, ఎందరికి ఉద్వాసన చెబుతారో దాని ప్రకారంగా 14 నుండి 17 మందికి మంత్రివర్గంలో కొత్తవారికి ఛాన్స్ దక్కనుంది. 

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ కూర్పు ఉండనుంది. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కోసం జగన్ తన టీమ్ ను సిద్దం చేసుకొంటున్నారు క్షేత్ర స్థాయిలో పార్టీని  బలోపేతం చేసేందుకు గాను  మంత్రివర్గం నుండి తప్పించిన వారికి బాధ్యతలు కేటాయింనున్నారు. ప్రభుత్వ పాలన కూడా సమర్ధవంతంగా సాగేందుకు వీలుగా సమర్ధులను మంత్రులగా ఎంచుకోనున్నారు. అనుభవం ఉన్న మంత్రులను కేబినెట్ లో కొనసాగిస్తే  రాజకీయంగా ప్రయోజనంగా ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో అనుభవం ఉన్న సీనియర్లను మంత్రిర్గంలో కొనసాగించాలని భావిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్