లోకేష్ ను అదుపులో పెట్టుకో, లేకపోతే తీవ్ర పరిణామాలు: చంద్రబాబుకు లక్ష్మీపార్వతి వార్నింగ్

Published : Jul 04, 2019, 11:00 AM ISTUpdated : Jul 04, 2019, 11:01 AM IST
లోకేష్ ను అదుపులో పెట్టుకో, లేకపోతే తీవ్ర పరిణామాలు: చంద్రబాబుకు లక్ష్మీపార్వతి వార్నింగ్

సారాంశం

లోకేష్ ను పక్కనబెడితే తప్ప టీడీపీ బాగుపడదంటూ సూచించారు. లోకేష్ నోటిని అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. లేకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. 

తిరుమల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి. తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి లోకేష్ కారణమంటూ ఆమె ఆరోపించారు. 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, హోంశాఖ మంత్రి సుచరితలపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదంటూ హితవు పలికారు. లోకేష్ ఎంత మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టుపట్టిపోతుందని శాపనార్థాలు పెట్టారు. 

లోకేష్ ను పక్కనబెడితే తప్ప టీడీపీ బాగుపడదంటూ సూచించారు. లోకేష్ నోటిని అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. లేకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు