చీరాల వైసీపీలో వర్గపోరు: ఆమంచికి కరణం వెంకటేష్ వార్నింగ్

By narsimha lodeFirst Published Sep 2, 2020, 12:36 PM IST
Highlights

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

ఒంగోలు: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు చీరాలలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించే కార్యక్రమాన్ని రెండు వర్గాలు పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహించాయి.

చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ఆనాడు ప్రమాణం చేశాం.. దీని కోసం తాము ప్రయత్నిస్తున్నట్టుగా  ఆయన చెప్పారు. చీరాలలో గతంలో బెదిరింపులు అరాచకాలు, బెదిరింపులు తగ్గినట్టుగా ఆయన గుర్తు చేశారు. చీరాలను అభివృద్ధి చేయడానికే తాము వైసీపీలోకి వచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ఎవరిని బెదిరింపులకు తాము భయపడమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగు జాడల్లో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు తామంతా కలిసిపనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

2019 ఎన్నికల్లో చీరాల నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కరణం బలరాం వైసీపీ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ పై పోటీ చేసి విజయం సాధించాడు. ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కరణం వెంకటేష్ వైసీపీలో చేరాడు. కరణం బలరాం మాత్రం జగన్ కు మద్దతు ప్రకటించారు.

click me!