రంగా హత్య : బొండా ఉమా కీలక వ్యాఖ్యలు.. నెహ్రూ పేరు తెస్తే తాట తీస్తానన్న దేవినేని అవినాశ్

By Siva KodatiFirst Published Dec 30, 2022, 6:42 PM IST
Highlights

దివంగత వంగవీటి మోహనరంగా హత్య గురించి టీడీపీ నేత బొండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు . ఈ నేపథ్యంలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ కౌంటరిచ్చారు. ఇకపై నెహ్రూ పేరు ప్రస్తావిస్తే లీగల్ గా ముందుకు వెళ్తామని అవినాశ్ హెచ్చరించారు. 
 

టీడీపీ నేత బొండా ఉమా, వైసీపీ నేత దేవినేని అవినాశ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ కౌంటరిచ్చారు. 

బోండా ఉమా ఒక చిల్లర వ్యక్తి, బజారు మనిషని.. బోండా ఉమా కుటుంబం గురించి పెంపకం చెప్పాలంటే చాలా ఉందన్నారు. తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమా అని అవినాశ్ ఆరోపించారు. కోగంటి సత్యం,ఐలపురం వెంకయ్య దగ్గర డ్రైవర్ గా పని చేసి కాళ్ళు నొక్కి చివరికి వారినే మోసం చేసిన వాడు బోండా ఉమా అంటూ దుయ్యబట్టారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే బోండా ఆగడాలపై విచారణ చేసింది వాస్తవం కాదా అని అవినాశ్ ప్రశ్నించారు. చంద్రబాబు కాళ్ళు పట్టుకుని బోండా ఉమ బయటపడ్డాడని ఆయన ఆరోపించారు. బైక్ రేసులు, కారు రేసులు,రేవ్ పార్టీ కల్చర్  నగరానికి తెచ్చింది బోండా ఉమా,ఆయన కుమారులేనని అవినాశ్ వ్యాఖ్యానించారు. 

Also Read: బెజవాడ రాజకీయాల్లో కలకలం : మళ్లీ ఒకే వేదికపైకి రాధా, నాని, వంశీ... రంగా గారి అబ్బాయిపైనే చూపు

మంత్రి పదవి కోసం చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన నీచ చరిత్ర బోండా ఉమదన్నారు. మంత్రి పదవి కోసం బ్లాక్ మెయిల్ చేస్తే చంద్రబాబు పిలిచి కబ్జాల లిస్ట్ చూపించి ఉమాకు వార్నింగ్ ఇచ్చారని అవినాశ్ ఆరోపించారు. కాపుల గొంతు చంద్రబాబు కోసారు అని అప్పట్లో  బోండా ఉమా మోరిగాడని ఆయన ఆరోపించారు. బోండా ఉమా లాంటి లోఫర్ ను చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరని అవినాశ్ దుయ్యబట్టారు. బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా ఉమ అని.. ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టే జగన్ నుంచి నాకు ప్రోత్సాహం ఉంద్నారు. ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం గురించి కానీ,తమ గురించి కానీ మాట్లాడితే తాట తీస్తామని అవినాశ్ హెచ్చరించారు. 

గతంలో ఒకటవ డివిజన్ లో మహిళలు రోడ్డు మీద చెప్పులతో కొట్టిన విషయం బోండా ఉమ గుర్తుంచుకోవాలని ఆయన చురకలంటించారు. మరో సారి నోరుజారి మాట్లాడితే అదే రిపీట్ అవుతుందని అవినాశ్ హెచ్చరించారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. చనిపోయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా దేవినేని నెహ్రూను ఇప్పటికీ టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు కేసు కూడా కొట్టేసిన విషయం అందరూ తెలుసుకోవాల్సి ఉందని.. ఇకపై నెహ్రూ పేరు ప్రస్తావిస్తే లీగల్ గా ముందుకు వెళ్తామని అవినాశ్ హెచ్చరించారు. 
 

click me!