2014 లో వైఎస్సార్ సిపి కాదంటేనె బిజెపి, టిడిపితో కలిసింది : అంబటి రాంబాబు

First Published Jun 6, 2018, 2:17 PM IST
Highlights

చంద్రబాబు వాచీ, చెయిన్  ఎందుకు వేసుకోడో చెప్పిన రాంబాబు....

వైఎస్సార్ సిపి కుల రాజకీయాలకు వ్యతిరేకమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. అందువల్లే 2014 లో బిజెపి వైఎస్సార్ సిపితో పొత్తు పెట్టుకోవాలని చూసినప్పుడు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడని తెలిపారు. మతతత్వ పార్టీలతో కలిసే ప్రసక్తే  లేదని ఆ సందర్భంగా జగన్ చెప్పినట్లు రాంబాబు తెలిపాడు. ఆ తర్వాతే బిజెపి, టిడిపి ని సంప్రదించి పొత్తు పెట్టుకున్నాయని రాంబాబు వ్యాఖ్యానించారు. 

గుంటూరులో ఇవాళ జరిగిన బూత్‌ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని వారికి పలు సూచనలు చఏశారు. ప్రజల్ని నయవంచన చేయడంలో సీఎం చంద్రబాబుకు తిరుగులేదు, అధికారం కోసం ఆయన ఎన్ని మాయమాటలైనా చెబుతాడని అన్నారు. ఇలాంటి మాటల్ని విని ప్రజలు మోసపోకుండా వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వినర్లు, కార్యకర్తలపైనే ఉందని అంబటి సూచించారు.

జగన్, బిజెపి కలిసిపోయారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, అలా అనుకుంటే 2014 లోనే కలిసేవారమని రాంబాబు అన్నాడు. ఇన్నాళ్లు ప్రధాని మోదీకి భజన చేసి నాలుగేళ్ల తర్వాత ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. ప్రతి విశయంలో తనకు 40ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం మోసాన్ని ఎందుకు గుర్తించలేక పోయాడని ప్రశ్నించారు.
 
ఇక వాచీ, చెయిన్ పెట్టుకోనని, చాలా సాధారణంగా ఉంటానని చంద్రబాబు చెప్తుంటారు. అవి పెట్టుకుంటే ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తాయనే పెట్టుకోరని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మందు తాగనంటాడు...కానీ ప్రజల రక్తాన్ని మాత్రం తాగుతాడని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.       
  

click me!