వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన ఆమంచి శ్రీనివాసులు..

Published : Jul 16, 2023, 01:43 PM IST
వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన ఆమంచి శ్రీనివాసులు..

సారాంశం

వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికు  విశాఖపట్నం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చీరాలలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికు  విశాఖపట్నం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చీరాలలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ  కీలక నేత ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) శనివారం జనసేనలో చేరారు. స్వాములు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు అవుతారు. స్వాములును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రజలు ముందుకు రావాలని పవన్‌ కోరారు. అధికార పార్టీ నేతలు, పోలీసుల అండదండలకు జనసేన భయపడదని, అధికార పార్టీ నుంచి వేధింపులు ఎదుర్కొనే ప్రతి నాయకుడికి అండగా ఉంటామని పవన్ చెప్పారు. జనసేనలో చేరిక సందర్భంగా  స్వాములు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి రివర్స్‌ ట్రెండ్‌లో సాగుతోందని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు అండగా నిలుస్తామని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్వాములు తెలిపారు.

ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వారాహి యాత్రతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. వైసీపీ సర్కార్‌గా విమర్శలు గుప్పిస్తూ.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు నేతు జనసేన‌లో చేరుతుండటం ఆ పార్టీ క్యాడర్‌కు మరింత జోష్‌ను తెచ్చిపెడుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం