వైసిపి సర్కార్ పాలనా సంస్కరణలు... ప్రతి జిల్లాకో అదనపు జెసి నియామకం

Arun Kumar P   | Asianet News
Published : May 06, 2020, 09:01 PM ISTUpdated : May 06, 2020, 09:31 PM IST
వైసిపి సర్కార్ పాలనా సంస్కరణలు... ప్రతి జిల్లాకో అదనపు జెసి నియామకం

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో పాలనా సంస్కరణల దిశగా ఏపి సర్కార్ మరో అడుగు ముందుకేసింది.

అమరావతి: రాష్ట్రంలో పరిపాలనను పటిష్టం చేసేందుకు ఎపీ సర్కార్ మరో అడుగు ముందుకేసింది.  ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలతో క్షేత్రస్ధాయిలో పాలనా సంస్కరణలు తీసుకువచ్చిన ప్రభుత్వం దీనిని వ్యవస్థీకరించేందుకు జిల్లా స్థాయిలో కొత్త మార్పులు చేపట్టింది. అభివృద్ధి...ప్రజాసంక్షేమం కోసం ప్రతి జిల్లాకు అదనంగా జాయింట్ కలెక్టర్ నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టైం స్కేల్ వున్న ఐఎఎస్ అధికారులకు జెసి బాధ్యతలను అప్పగించింది. 

ఈ నియామకం ద్వారా ప్రతి జిల్లాకు ముగ్గురు జెసిలు వుండనున్నారు. ఈ జెసిలు, వారు చేపట్టే విధులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రప్రభుత్వం.
పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం ఈ ప్రయత్నం చేసినట్లు... గ్రామస్థాయికి పాలనను తీసుకువెళ్ళేందుకు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. 

ఓ జెసి(విఅండ్ డబ్ల్యుఎస్)కి కీలకమైన వార్డు, గ్రామ సచివాలయాల బాధ్యతలను అప్పగించారు. సచివాలయాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ జేసి  పర్యవేక్షించనున్నారు. పంచాయతీరాజ్, వైద్యం, కుటుంబసంక్షేమం, పాఠశాల, ఉన్నత విద్య, పట్టణాభివృద్ధితో పాటే గృహనిర్మాణం, మీసేవా, ఆర్టీజి అండ్ ఐటిఇ అండ్ సి డిపార్ట్ మెంట్ ల బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఇరిగేషన్, ఎనర్జీ మినహా మిగిలిన అన్ని ఇంజనీరింగ్ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు ఈ జెసికి అప్పగించారు. 

ఇప్పటి వరకు జెసి-1 గా వున్న పోస్ట్ ను జెసి- రైతు భరోసా, రెవెన్యూ (జెసి-ఆర్ అండ్ ఆర్) గా గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయం, పౌరసరఫరాలు, మార్కెటింగ్, సహకారం తో పాటు పశుసంవర్థక, ఉద్యానవన, మత్స్యశాఖ, పట్టుపరిశ్రమల బాధ్యతలను ఈ జెసికి అప్పగించారు. అలాగే రెవెన్యూ, సర్వే, విపత్తుల నిర్వహణ, ఇరిగేషన్, శాంతిభద్రతలు, ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్, భూగర్భగనులు, ఎనర్జీ విభాగాలను ఈ జెసి పర్యవేక్షిస్తారు.

ఇప్పటి వరకు జెసి-2 గా వున్న పోస్ట్ ను జెసి-ఆసరా అండ్ వెల్ఫేర్ (జెపి-ఎ అండ్ డబ్ల్యు)గా మార్చారు. ఈ పోస్ట్ ను స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో భర్తీ చేశారు. గ్రామీణాభివృద్ధి (డిఆర్డిఎ, డ్వామా), మహిళా, శిశు సంక్షేమం, బిసి, ఎస్సీ, ట్రైబల్, మైనార్టీ, డిసేబుల్డ్ వెల్ఫేర్, పరిశ్రమలు, వాణిజ్యం, దేవాదాయశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను ఈ జెసి చూసుకోన్నారు.

ఈ ముగ్గురు జేసిలకు జిల్లా కలెక్టర్ ప్రాతినిత్యం వహిస్తారు.  సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ కార్యకలాపాలను ముందుకు తీసుకువెడతారు. సీనియర్ టైం స్కేల్ ఐఎఎస్ లకు జిల్లాస్థాయి పాలనలో భాగస్వామ్యంకు చక్కని అవకాశం లభించిందని... దాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం జెసిలకు సూచించింది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్