తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై పార్లమెంట్‌లో నిలదీస్తాం: వైసీపీ ఎంపీవిజయసాయిరెడ్డి

By narsimha lodeFirst Published Jul 15, 2021, 2:29 PM IST
Highlights

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకొంటుంది. తెలంగాన నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని వైసీపీ ఇవాళ ప్రకటించింది.ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం గురువారం నాడు అమరావతిలో జరిగింది.

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం నాడు అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను  ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు.ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామన్నారు. తమ  రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాను ఉపయోగించుకొనేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. గత రెండేళ్లు మినహా ఏనాడూ కూడ శ్రీశైలం ప్రాజెక్టు నుండి 25 రోజులకు మించి వరద రాలేదన్నారు. అందుకే తెలంగాణ మాదిరిగానే తాము కూడ 800 అడుగుల నుండి  నీటిని ఉపయోగించుకొంటామన్నారు.

కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. అదేవిధంగా ఉమ్మడి ప్రాజెక్టులపై సీఐఎస్ఎఫ్ తో భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హమీలను అమలు చేయాలని ఆయన కోరారు. దిశ చట్టాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతామని విజయసాయిరెడ్డి  చెప్పారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు  అందించిన విద్యుత్ కు సంబంధించి రూ. 6,112 కోట్లు బకాయిలు  చెల్లించాల్సి ఉందన్నారు.ఈ బకాయిలను చెల్లించాలని కోరుతామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పోలవరం నిధుల అంశాన్ని లేవనెత్తుతామన్నారు.  విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అయితే ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా ఉండేందుకు మూడు ప్రత్యామ్నాయాలను కేంద్రానికి సూచింని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


 

click me!