తిరువూరు చైర్మన్ ఎన్నికలు వాయిదా.. కౌన్సిలర్లను కూటమి గూండాలే అడ్డుకున్నారంటున్న వైసిపి

Arun Kumar P   | ANI
Published : May 20, 2025, 03:28 PM IST
Jalla Sudarshan Reddy, Legal Cell YSRCP (Photo/YSRCP)

సారాంశం

తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై జరిగిన హింసలో పోలీసులు కుమ్మక్కయ్యారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఎన్నికల కమిషన్, కోర్టు ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారని.. టీడీపీ, బీజేపీ, జనసేన గూండాలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 

Andhra Pradesh Politics: ఎన్నికల కమిషన్, న్యాయస్థాన ఆదేశాలను ఉల్లంఘించి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై దాడిలో పోలీసుల కీలకపాత్ర పోషించారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధి జల్ల సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. తిరువూరులో జరిగిన హింసకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులే కారణమని ఆయన అన్నారు.

తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై కూటమి పార్టీల (టీడీపీ, బీజేపీ, జనసేన) గూండాలు దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సమయంలో కౌన్సిలర్లకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడి చేసిన వారితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దాడి చేసినవారిని వదిలేసి దాడికి గురయిన వైఎస్సార్‌సీపి నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాలు, స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉన్నప్పటికీ కౌన్సిలర్లకు సురక్షితగా తరలించడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, కౌన్సిలర్ల ప్రయాణ ప్రణాళికలను పోలీసులకు వివరంగా సమర్పించినప్పటికీ ఎలాంటి రక్షణ కల్పించలేదని ప్రకటనలో పేర్కొన్నారు. 

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, నాయకుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ)కి చెందిన పలువురు కీలక నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఎ. కొండూరు మండలంలోని మాధవరం గ్రామంలో కూటమి పార్టీల మద్దతుదారులు కౌన్సిలర్లను ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు... తమ భద్రతకు భయపడి కౌన్సిలర్లు వెనుదిరిగి వెళ్ళవలసి వచ్చిందని, ఎన్నికల్లో పాల్గొనలేకపోయారని సుదర్శన్ రెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌సీపీకి మెజారిటీ ఉన్నా తమ పరిమిత కౌన్సిలర్లతో ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలనే కూటమి పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యూహాన్ని అవలంబించాయని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. "పోలీసులు గూండాలతో కలిసి కోర్టు మరియు ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించింది. దీన్ని బట్టే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్య చేయబడిందని స్పష్టమవుతుంది" అని సుదర్శన్ రెడ్డి అన్నారు. 

నిన్న రాత్రి దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌ను నేడు కోర్టు విచారణకు స్వీకరించిందని, ప్రభుత్వ న్యాయవాది తగిన రక్షణ కల్పించామని అబద్ధంగా చెప్పారని ఆయన వెల్లడించారు.  భద్రతా చర్యలపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోర్టు ఇప్పుడు అధికారులను ఆదేశించింది. ఈ దుర్మార్గంలో కుమ్మక్కైన అధికారులను జవాబుదారీగా చేస్తూ, వైఎస్సార్‌సీపీ ఈ విషయాన్ని న్యాయవ్యవస్థ దృష్టికి తీసుకువెళుతుందన్నారు సుదర్శన్ రెడ్డి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం