శ్రీకాకుళంలో వైఎస్ విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Oct 07, 2020, 06:26 PM IST
శ్రీకాకుళంలో వైఎస్ విగ్రహం ధ్వంసం, ఉద్రిక్తత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని శ్రీ‌కాకుళం జిల్లా భామిని మండ‌లం కొర‌మలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని శ్రీ‌కాకుళం జిల్లా భామిని మండ‌లం కొర‌మలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి వేసి కిందపడేశారు.

మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్‌ 2న డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు.

పాల‌కొండ ఎమ్మెల్యే వి.క‌ళావ‌తి, డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్‌ విగ్రహ ధ్వంసాన్ని ఖండించారు. విగ్ర‌హం ఏర్పాటు విష‌యంలో గ్రామంలో ఎటువంటి వివాదం లేదని తెలిపారు. వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం చేయడంపై స్థానికులు, వైసీపీ అభిమానులు ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు