వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. ప్రశాంత్ కిశోర్ రిపోర్టే.. వైసీపీకి 40 సీట్లు మాత్రమే వస్తాయని సంకేతాలు ఇస్తున్నాయని కామెంట్ చేశారు.
Janasena: జనసేన నాయకుడు, అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీల గెలుపు తథ్యం అని చెప్పారు. ఈ రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన సభతోనే వైసీపీ ఓటమి ఖాయమైందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం.. వైసీపీ నాయకులు జీర్ణించుకోవడం లేదని అన్నారు.
ఇదే సందర్భంగా ఆయన ప్రశాంత్ కిశోర్ సర్వే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కనీసం 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశాల్లేవని ప్రశాంత్ కిశోర్ సర్వే సంకేతాలు ఇచ్చిందని పోతిన మహేష్ ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికలు జగన్‌ను గద్దె దింపుతాయని అన్నారు. అంతేకాదు, టీడీపీ, జనసేన కూటమి 150 అసెంబ్లీ స్థానాలను, 25 లోక్ సభ స్థానాలను గెలుచుకుని తీరుతుందని తెలిపారు.
Also Read: రా.. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
పవన్ కళ్యాణ్ పై కూతలు కూయడం మానుకోవాలని మహేష్ వార్నింగ్ ఇచ్చారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై కూతలు కూస్తే తాము తగిన విధంగా జవాబిస్తామని వివరించారు. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలతో వైసీపీ ఓటమి కచ్చితం అని విమర్శించారు.