‘న్యాయం చేయండి సార్’ అంటూ.. ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న మహిళ..!!

Published : Jun 12, 2021, 12:35 PM IST
‘న్యాయం చేయండి సార్’ అంటూ.. ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న మహిళ..!!

సారాంశం

అమరావతి : ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించి పోతున్నాయి. ప్రభుత్వ పథకాలు తమకు అందడంలేదని మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మీ దిక్కున్నచోట చెప్పుకోండంటూ వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. 

మాకు న్యాయం చేయండి సార్ అంటూ ఓ మహిళ ఎంపీడీవో కాళ్లపై పడిన ఘటన నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, అప్పారావు పాలెంలో కలకలం రేపుతోంది.

ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న మహిళ పేరు చెంచెమ్మ. జగనన్న చేయూత పథకానికి అర్హురాలు అయినప్పటికీ.. ఇప్పటి వరకు ఆ పథకం నిధులు ఆమెకు అందలేదు. 

గ్రామ వాలంటీర్‌ను అడిగితే మా నాయకులు చెబితేనే జగనన్న చేయూత పథకం వస్తుందని లేకుంటే రాదని చెప్పడంతో బాధితురాలు ఎంపీడీవో రాఘవేంద్రరావును కలిసి తన గోడును వెల్లబోసుకుంది.

నాయకులను అడిగితే వేధిస్తున్నారని కాళ్లమీదపడి వేడుకుంది. దీనిపై స్పందించిన ఆయన గ్రామంలో విచారించి పథకం అందేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు.
 
PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు