వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ విచారణకు హజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి

By narsimha lode  |  First Published Feb 24, 2023, 1:01 PM IST

కడప ఎంపీ  వైఎస్ వివేకానందరెడ్డి  ఇవాళ సీబీఐ విచారణకు  హజరయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  అవినాష్ రెడ్డి కి  సీబీఐ అధికారులు నోటీసులు  జారీ చేసిన విషయం తెలిసిందే.  
 


హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ  విచారణకు   శుక్రవారం నాడు  హజరయ్యారు. గతంలో  కూడా  ఇదే కేసులో  సీబీఐ విచారణకు  అవినాష్ రెడ్డి  వచ్చారు.   ఈ కేసులో  మరింత సమాచారం కోసం  విచారణకు  రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు 160 సెక్షన్ కింద నోటీస్ జారీ  చేశారు. దీంతో  ఆయన ఇవాళ  సీబీఐ విచారణకు  హజరయ్యారు. 

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  ఈ ఏడాది  జనవరి  28వ తేదీన  వైఎస్ అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు  హజరయ్యారు.  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  నిందితుడిగా  ఉన్న సునీల్ యాదవ్  బెయిల్  ఇవ్వవద్దని  సీబీఐ కౌంటర్ దాఖలు  చేసింది.ఈ కౌంటర్ లో  సీబీఐ కీలక అంశాలను  ప్రస్తావించింది. 

Latest Videos

సునీల్ యాదవ్ ను  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వార్నింగ్  ఇవ్వడంతో  ఆయనపై సునీల్ యాదవ్  కోపం పెంచుకున్నాడని  ఈ పిటిషన్ లో  సీబీఐ పేర్కొంది.   ఎర్ర గంగిరెడ్డితో  కలిసి  వైఎస్ వివేకానందరెడ్డిని హత్య  చేయాలని ప్లాన్  చేశారని  కౌంటర్ పిటిషన్  లో  పేర్కొంది  సీబీఐ.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  రూ.  40 కోట్ల డీల్  కుదిరిందని కూడా  పేర్కొంది. హత్య జరిగిన  రోజున వైఎస్ అవినాష్ రెడ్డి  నివాసంలోనే  నిందితులు  ఉన్నారని  సీబీఐ  పేర్కొంది.   ఈ కేసు విషయమై  సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని  ఇవాళ విచారిస్తున్నారు. 

2019 మార్చి  19వ తేదీన పులివెందులలోని  నివాసంలోనే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని  నిందితులు హత్య  చేశారు.   ఈ హత్య కేసును  సీబీఐ విచారిస్తుంది.  ఈ హత్య  జరిగిన సమయంలో  చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా  ఉన్నారు. చంద్రబాబు సర్కార్  సిట్  ను ఏర్పాటు  చేసి కేసును విచారించింది.  ఆ తర్వాత  జరిగిన  ఎన్నికల్లో  వైసీపీ ప్రభుత్వం  ఏర్పాటైంది.  జగన్  ప్రభుత్వం  కూడా  సిట్  ను ఏర్పాటు  చేసి విచారణ నిర్వహించింది.  అయితే  ఈకేసును  సీబీఐతో విచారణ చేయించాలని  వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు వైఎస్ సునీతమ్మతో పాటు, టీడీపీ నేత  బీటెక్ రవి,  మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు  ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు  సీబీఐ విచారణకు ఆదేశించింది .

also read:వివేకా హత్యకు కారణమిదే, గంగిరెడ్డితో కలిసి సునీల్‌ స్కెచ్, అవినాశ్ రెడ్డిదీ కీలక పాత్రే : సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను  ఏపీ రాష్ట్రంలో  కాకుండా  ఇతర  రాష్ట్రాల్లో  నిర్వహించాలని  వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు  దాఖలు  చేసిన  పిటిషన్ పై   సుప్రీంకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసు విచారణను తెలంగాణకు  బదిలీ చేసింది.  


 

click me!