ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాసరి సుధ (dasari sudha) ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. 6 నెలల విరామం తర్వాత Assembly జరుగుతుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జూలై నుంచి ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఇక, గురువారం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాసరి సుధ (dasari sudha) ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కస్కరిస్తున్నట్టుగా స్పీకర్ తమ్మనేని సీతారాం (Tammineni Sitaram) ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఇతర సభ్యులు.. రాష్ట్రంలో పెట్రోల్, డిజీల్, నిత్యావసరాల ధరల గురించి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు శాసనసభ సంతాపం తెలిపింది.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సభలో చర్చించాలని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని కోరుతోంది. అయితే నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే దానిపై మాత్రం స్పష్టత లేదు.