వైఎస్ వివేకా హత్య కేసు.. ఎవరీ సుబ్బరాయుడు..?

Published : Jul 13, 2021, 08:55 AM IST
వైఎస్ వివేకా హత్య కేసు..  ఎవరీ సుబ్బరాయుడు..?

సారాంశం

అసలు ఎవరీ సుబ్బరాయుడు అనే విషయం తీవ్ర  చర్చనీయాంశమైంది.కాగా.. ఈ సుబ్బరాయుడు కడపకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులు ఎవరో ఇప్పటి వరకు బయటకు రాలేదు. కనీసం ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం కూడా బయటకు రాలేదు. కాగా.. తాజాగా ఈ కేసులో మరో వ్యక్తి పేరు బయటకు వచ్చింది. 

సుబ్బరాయుడు అనే వ్యక్తిపై వివేకా కుమార్తె సునీతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అసలు ఎవరీ సుబ్బరాయుడు అనే విషయం తీవ్ర  చర్చనీయాంశమైంది.కాగా.. ఈ సుబ్బరాయుడు కడపకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అసలు ఈ సుబ్బరాయుడుపై సునీత ఎందుకు ఫిర్యాదు చేశారు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఈ సుబ్బరాయుడు.. ఇటీవల  వివేకా కేసుకు సంబంధించిన సాక్ష్యాల వివరాలు కావాలంటూ సెంట్రల్ గ్రీవెన్ సెల్ ను కోరాడు. అలాగే వివేకా కుమార్తె సునీతను కూడా అదుపులోకి తీసుకొని విచారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశాడు. ఈ విషయం సునీత సెల్‌కు మెయిల్ వెళ్లడంతో సుబ్బరాయుడుపై కేసు నమోదుచేసి చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పులివెందుల డీఎస్పీకి సునీత ఫిర్యాదు ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!