తండ్రి హత్యకేసు: సీఎం జగన్ ను కలిసిన వైఎస్ వివేకా కూతురు సునీత

By Nagaraju penumalaFirst Published Jun 5, 2019, 2:37 PM IST
Highlights

ఇకపోతే ఎన్నికలకు ముందు అంటే 2019 మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి కేసు విచారణ నిమిత్తం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను నియమించింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు. తన తండ్రి హత్యపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని జగన్ నివాసంలో భేటీ అయ్యారు. అరగంట పాటు హత్యపై చర్చించినట్లు తెలుస్తోంది. 

వైయస్ వివేకానందరెడ్డి హత్యపై ఆనాటి ప్రభుత్వం వేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని సునీత సీఎం వైయస్ జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తును మెుదటి నుంచి చేయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. 

ఇకపోతే ఎన్నికలకు ముందు అంటే 2019 మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి కేసు విచారణ నిమిత్తం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను నియమించింది. 

సిట్ దర్యాప్తు సంస్థ ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మరియు కుటుంబ సభ్యులు మాత్రం సిట్ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

తన తండ్రి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణమాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైయస్ వివేకానందరెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా చిన్నాన్న అవుతారు.   

click me!