వివేకా రెండో భార్య ఆరోపణలు.. సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, ఏం జరుగుతోంది..?

Siva Kodati |  
Published : Apr 22, 2023, 05:18 PM ISTUpdated : Apr 22, 2023, 07:26 PM IST
వివేకా రెండో భార్య ఆరోపణలు.. సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, ఏం జరుగుతోంది..?

సారాంశం

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కోఠీలోని సీబీఐ కార్యాలయానికి వివేకా అల్లుడు , సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వివేకా రెండో భార్య షమీమ్ ఆరోపణల నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులను కలవడం చర్చనీయాంశమైంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కోఠీలోని సీబీఐ కార్యాలయానికి వివేకా అల్లుడు , సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వివేకా కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ ముగిసిన అనంతరం ఆయన సీబీఐ అధికారులతో భేటీ అయ్యారు. వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ వెలుగులోకి రావడంతో రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులను కలవడం చర్చనీయాంశమైంది. రాజశేఖర్ రెడ్డి, అతని సోదరుడు తనను చాలా సార్లు బెదిరించారని షమీమ్ సీబీఐ అధికారులకు తెలిపిన సంగతి తెలిసిందే.  అయితే దాదాపు రెండు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయనను విచారించారు. 

కాగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన రెండో భార్యగా చెబుతోన్న షమీమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. తనకు , వివేకాకు 2010లో వివాహం జరిగిందని అయితే మా పెళ్లి వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నారు. 2015లో తమకు కుమారుడు షెహన్‌షామ్ పుట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. అయితే వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డితో పాటు వివేకా కుమార్తె సునీత కూడా తనను దూరంగా వుండాల్సిందిగా బెదిరించారని షమీమ్ పేర్కొన్నారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. చివరికి చెక్ పవర్ కూడా తీసేశారని ఆమె ఆరోపించారు. 

Also Read: వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్: మధ్యంతర బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాష్ రెడ్డికి ఆశ వుండేదని షమీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య జరగడానికి కొద్దిగంటల ముందు కూడా తాను వివేకాతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చెక్ పవర్ తీసేయడంతో వివేకా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని షమీమ్ చెప్పారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పినట్లు షమీమ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. మరి దీనిపై వివేకా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

షమీమ్ 2005 నుంచి ఉద్యోగం వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డీస్ ల్యాబ్ లో ఉద్యోగం కోసం వివేకానంద రెడ్డి సిఫారసు లేఖ ఇచ్చారని, అయినా కూడా తనకు ఉద్యోగం రాలేదని ఆమె తన వాంగ్మూలంలో చెప్పినట్లు టీవీ చానెల్స్ వార్తాకథనాలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu
CM Chandrababu Naidu & Minister Nara Lokesh: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు | Asianet News Telugu